మంచు కురిసే వేళలో రొమాన్స్! | Tiger Shroff and Kriti Sanon brave Kashmir's weather for Heropanti | Sakshi
Sakshi News home page

మంచు కురిసే వేళలో రొమాన్స్!

Feb 9 2014 11:50 PM | Updated on Sep 2 2017 3:31 AM

మంచు కురిసే వేళలో రొమాన్స్!

మంచు కురిసే వేళలో రొమాన్స్!

మంచు కురిసే వేళలో టైగర్ ష్రాఫ్, కృతి సనాన్ ప్రేమ ఊసులు చెప్పుకోవడం మొదలుపెట్టారు. మైనస్ 9 డిగ్రీల చలిని కూడా ఈ ఇద్దరూ ఖాతరు చేయలేదు.

 మంచు కురిసే వేళలో టైగర్ ష్రాఫ్, కృతి సనాన్ ప్రేమ ఊసులు చెప్పుకోవడం మొదలుపెట్టారు. మైనస్ 9 డిగ్రీల చలిని కూడా ఈ ఇద్దరూ ఖాతరు చేయలేదు. బహుశా వాళ్లున్న పరిస్థితికి మంచు కూడా వేడిగా, హాయిగా అనిపించిందేమో! పైగా పదడుగుల ఎత్తున్న ఉయ్యాలలో ఊగుతూ తీయని కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. హఠాత్తుగా ఉయ్యాల జారింది. ప్రేమికులిద్దరూ మంచుగడ్డలపై కూలబడ్డారు. దాంతో గాయాలపాలయ్యారు. ఇదంతా జరిగింది... ‘హీరోపంటి’ చిత్రం షూటింగ్‌లో. జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్, కృతి సనాన్ జంటగా షబ్బీర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
 
  హీరో హీరోయిన్లపై కాశ్మీర్‌లో రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీని గురించి షబ్బీర్ మాట్లాడుతూ - ‘‘కాశ్మీర్‌లో వాతావరణం తట్టుకోలేనంత చల్లగా ఉంది. మేమంతా వంటినిండా బట్టలేసుకుంటే, టైగర్, కృతి మాత్రం చిట్టి, పొట్టి దుస్తుల్లో షూటింగ్ చేయాల్సి వచ్చింది. అయినా ఇద్దరూ వెనకడుగు వేయలేదు. వెన్నులో వణుకుపుడుతున్నా బయటికి కనిపించనివ్వకుండా షూటింగ్‌లో లీనమయ్యారు. దురదృష్టం కొద్దీ ఉయ్యాల తెగిపోయింది. ఇద్దరికీ చాలా గాయాలయ్యాయి. కానీ, తమ కారణంగా షూటింగ్‌కి ఆటంకం ఏర్పడకూడదని, గాయాలను లెక్క చేయకుండా నటించారు. ఈ యువతారల కమిట్‌మెంట్ చూసి ఆశ్చర్యపోయాం’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement