వారి రొమాన్స్ మరో స్టేజీ దాటింది! | Tiger Shroff and girlfriend Disha Patani are taking their relationship a level higher | Sakshi
Sakshi News home page

వారి రొమాన్స్ మరో స్టేజీ దాటింది!

Feb 4 2016 2:58 PM | Updated on Apr 3 2019 6:23 PM

వారి రొమాన్స్ మరో స్టేజీ దాటింది! - Sakshi

వారి రొమాన్స్ మరో స్టేజీ దాటింది!

జాకీష్రాఫ్ కుమారుడిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు టైగర్ ష్రాఫ్. తక్కువ కాలంలోనే తనకంటూ మంచిపేరు తెచ్చుకున్నాడు టైగర్.

ముంబై: జాకీష్రాఫ్ కుమారుడిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు టైగర్ ష్రాఫ్. తక్కువ కాలంలోనే తనకంటూ మంచిపేరు తెచ్చుకున్నాడు టైగర్. 'బాగీ', 'ఫ్లైయింగ్ జాట్' మూవీలతో టైగర్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన ప్రియురాలు దిశా పటానీతో గడపటానికి కూడా టైం కేటాయిస్తున్నాడు. టాలీవుడ్ మూవీ లోఫర్ ఫేమ్ దిశాపటానీ, టైగర్ ప్రేమపక్షుల్లా విహరిస్తున్నారు. వీరిద్దరూ తమ రిలేషన్షిప్ ను మరో స్టేజ్కి తీసుకెళ్లారు. తాజాగా వీరిద్దరూ డేటింగ్ కూడా మొదలెట్టారని బాలీవుడ్ లో గుసగుసలు వినిసిస్తున్నాయి.

హీరోపంతీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన టైగర్ వేగంగానే డ్యాన్సింగ్ స్కిల్స్ అలవరుచుకున్నాడు. అంతటితో అగకుంగా తన లవర్ దిశాకు డ్యాన్స్ చేయడంలో మెలకువలు నేర్పించడంలోనూ బిజీగా ఉంటున్నాడట. జాకీ చాన్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో తన షెడ్యూలు కంప్లీట్ చేసుకున్న దిశా పటానీ తరచుగా టైగర్ను కలుసుకుంటోంది. ఈ ప్రేమజంట ముంబై అంధేరిలోని డ్యాన్స్ స్టూడియోలను తమ ప్రాక్టీస్ కోసం బుక్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదే అదనుగా భావించిన ఈ బాలీవుడ్ ప్రేమ పక్షులకు ఏకాంతంగా కలిసేందుకు ఇదో వంక బాగా కలిసొచ్చిందంటూ చెవులు కొరుక్కుంటున్నారు. 'బాగీ' లో శ్రద్ధాకపూర్ తో, 'ఫ్లైయింగ్ జాట్'లో శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లతో పాటు ప్రియురాలు దిశా పటానీతోనూ రొమాన్స్ చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. 'బాగీ'తో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు బాలీవుడ్లో విలన్గా ఎంట్రీ ఇస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement