థ్రిల్లింగ్ యాక్షన్ | Thrilling action Amazon warriors | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్ యాక్షన్

Jun 5 2016 2:02 AM | Updated on May 25 2018 7:16 PM

థ్రిల్లింగ్ యాక్షన్ - Sakshi

థ్రిల్లింగ్ యాక్షన్

ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ నిర్మించిన ‘ది లెజండరీ అమెజాన్స్’ చిత్రం ‘అమెజాన్ యోధులు’ పేరుతో తెలుగులో...

ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ నిర్మించిన ‘ది లెజండరీ అమెజాన్స్’ చిత్రం ‘అమెజాన్ యోధులు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. రిచాజెన్, సెసిలియా చియాంగ్ జంటగా ఫ్రాంకీచాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జి.వంశీకృష్ణ వర్మ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత డీఎస్ రావు, పోస్టర్స్‌ని నిర్మాత రామకృష్ణ గౌడ్ రిలీజ్ చేశారు. ‘‘యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కలిగిస్తాయి.

500 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఇది. ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని వంశీకృష్ణ వర్మ చెప్పారు. సహ నిర్మాత: జి.యుగంధర్ రెడ్డి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement