మూడు షేడ్స్‌ ఉన్న  మహర్షి | Three shades of mahesh babu maharshi movie | Sakshi
Sakshi News home page

మూడు షేడ్స్‌ ఉన్న  మహర్షి

Dec 5 2018 12:28 AM | Updated on Apr 7 2019 12:28 PM

Three shades of mahesh babu maharshi movie - Sakshi

స్టార్‌ హీరోస్‌ని స్క్రీన్‌ మీద ఎంతసేపు చూసినా అభిమానులకు తనివి తీరదు. ఒకే టికెట్‌ మీద రకరకాల షేడ్స్‌ ఉన్న పాత్రలో అభిమాన హీరోని చూస్తే? ఫ్యాన్స్‌కి పండగే. ప్రస్తుతం మహేశ్‌ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు అలాంటి ట్రీట్‌నే ప్లాన్‌ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆయన దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ‘అల్లరి నరేశ్‌ మహేశ్‌ మిత్రుడిగా ‘రవి’ పాత్రలో కనిపించనున్నారు.
 

ఈ సినిమాలో మహేశ్‌బాబు కాలేజ్‌ స్టూడెంట్‌గా, బిజినెస్‌ మేన్‌గా కనిపిస్తారని తెలిసిందే. అయితే మోడ్రన్‌ రైతుగానూ ఈ చిత్రంలో కనిపిస్తారని సమాచారం. సో.. మూడు దశల్లో నడిచే ఈ కథలో మూడు డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. ఆల్రెడీ yð హ్రాడూన్‌లో స్టూడెంట్‌గా, యూఎస్‌లో బిజినెస్‌మేన్‌గా ఉన్న సన్నివేశాల షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ స్టూడియోలో వేసిన గ్రామీణ సెట్లో షూటింగ్‌ జరుపుకుంటోంది ‘మహర్షి’. వచ్చే ఏడాది ఉగాది స్పెషల్‌గా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: కేయూ మోహనన్‌. 

Advertisement
 
Advertisement
Advertisement