చిత్రమైన శారీరక భాష, విభిన్నమైన సంభాషణా చాతుర్యం. నవ్వు తెప్పించే హావభావాలు... వెరసి సుమన్ శెట్టి. నటుడవుతానని కలలో కూడా ఊహించని సుమన్ శెట్టి ఏకంగా ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీ హాస్యనటుడు. ఈ జనరేషన్‌లో అలాంటి అరుదైన అవకాశం తనకే దక్కింది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని నవ్వులు కురిపిస్తానని ఆత్మవిశ్వాసం కనబరుస్తున్న సుమన్ శెట్టితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ...
కెరీర్ ఎలా ఉంది?
చాలా బిజీగా ఉందండీ.. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, భోజ్‌పురి భాషల్లో కూడా నటిస్తున్నాను. ఇంత బిజీ ఆర్టిస్టుని అవుతానని నేను అస్సలు ఊహించలేదు.
అసలు నటనపై ఆసక్తి ఎలా మొదలైంది?
‘నువ్వు సినిమాల్లో పనికొస్తావురా’ అని చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు. నేను లైట్‌గా తీసుకునేవాణ్ణి. వైజాగ్‌లో మాది రైస్, ఆయిల్ హోల్‌సేల్ వ్యాపారం. ఆ రోజు నాన్నకు పనుండి బయటకు వెళ్లడంతో నేనే షాపులో కూర్చున్నా. అప్పుడే... ‘చిత్రం’ సినీ వారపత్రిక చూశాను. ‘జయం’ సినిమా కోసం నూతన నటీనటులు కావలెను అనే ప్రకటన అందులో కనిపించింది. వెంటనే నా ఫొటోలను, బయోడేటాను పంపించాను. నాకైతే పిలుపు వస్తుందని నమ్మకం లేదు. కానీ... అనుకోకుండా తేజగారి నుంచి కబురొచ్చింది. ఆ క్షణాలు నా జీవితంలో మరిచిపోలేను.
నటనపై అవగాహన లేని మీరు ఒక్కసారిగా కెమెరా ముందుకెళ్లినప్పుడు భయం అనిపించలేదా?
చచ్చేంత భయం వేసింది. పైగా తేజగారు కోపిష్టి. కొట్టేస్తారని చాలా మంది భయపెట్టారు. ఆ భయంలోనే తొలి షాట్‌కే 14 టేకులు తిన్నాను. ఇంకేముంది... తేజ కొట్టేస్తారేమో అనుకున్నా. కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదు. పైగా 15వ టేక్ ఓకే అవ్వగానే... తాను క్లాప్స్ కొట్టి, యూనిట్ అందరితో క్లాప్స్ కొట్టించారు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే.
రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయారు కదా, మీ ఊళ్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?
మా తాతగారి పేరు పూసల్ల సూరిబాబు. చాలా ఫేమస్. మా నాన్నగారి పేరు గుప్తా. మా నాన్నగారిక్కూడా వైజాగ్‌లో చాలా మంచి పేరుంది. నన్నందరూ ‘గుప్తాగారబ్బాయి’ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు అందరూ మా నాన్నను ‘సుమన్‌శెట్టి నాన్న’ అంటున్నారు. ఇంతకంటే ఏం సాధించాలి. మాది పెద్ద వ్యాపారం. మా షాపు ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. కానీ ‘జయం’ తర్వాత మా షాపుకు సరుకు కోసం వచ్చేవారికంటే నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్లు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయాం.
తమిళంలో కూడా మీకు మంచి స్టార్‌డమ్ ఉన్నట్టుంది?
ఇక్కడ లాగే అక్కడ కూడా నన్ను చాలా అభిమానిస్తారండీ. తమిళ ‘జయం’, ‘7/జి బృందావన్ కాలనీ’ చిత్రాలు అక్కడ కూడా నాకు మంచి పేరు తెచ్చాయి. దాదాపు తమిళ స్టార్స్ అందరితో నటించా. నన్ను తమిళియన్ అనుకునేవారు అక్కడ కోకొల్లలు. కొందరైతే ‘నువ్వు ప్రముఖ హాస్యనటుడు సెంథిల్ కొడుకువా..’ అని అడుగుతుంటారు. చాలామంది నన్ను అలాగే అనుకుంటారు కూడా.
మీరేం చెబుతారు?
‘నేను తెలుగువాణ్ణి. మాది వైజాగ్..’ అని గర్వంగా చెబుతా. ఏ భాషలో నటిస్తున్నా... నా భాషను, నా ప్రాంతాన్ని గౌరవించుకోవడం నా ధర్మం.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
ఆడు మగాడ్రా బుజ్జీ, మసాలా సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. రింగ్‌టోన్, మనుషులతో జాగ్రత్త సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా ఇతర భాషల్లో కూడా బిజీగా ఉన్నాను.
డ్రీమ్ కేరక్టర్ ఏమైనా ఉందా?
నవ్విస్తూ ఏడిపించే పాత్ర చేయాలని ఉంది. అలాగే నవ్విస్తూ... కోపం తెప్పించే పాత్ర చేయాలని ఉంది.
తమిళనాడులో నన్నంతా సెంథిల్ కొడుకు అనుకుంటారు - సుమన్‌శెట్టి
Published Tue, Nov 5 2013 11:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement