వెండితెర మీద మోగ్లీ సాహసాలు | the jungle book releasing on april 15 | Sakshi
Sakshi News home page

వెండితెర మీద మోగ్లీ సాహసాలు

Feb 9 2016 8:24 PM | Updated on Sep 3 2017 5:17 PM

వెండితెర మీద మోగ్లీ సాహసాలు

వెండితెర మీద మోగ్లీ సాహసాలు

దశాబ్దాలుగా బుల్లితెర మీద సంచలనాలు నమోదు చేసిన కార్టూన్ షో 'ది జంగిల్ బుక్' త్వరలో వెండితెర మీద సందడి చేయనుంది, ఇప్పటి వరకు యానిమేషన్ క్యారెక్టర్ల రూపంలో మాత్రమే కనిపించిన...

దశాబ్దాలుగా బుల్లితెర మీద సంచలనాలు నమోదు చేసిన కార్టూన్ షో 'ది జంగిల్ బుక్' త్వరలో వెండితెర మీద సందడి చేయనుంది, ఇప్పటి వరకు యానిమేషన్ క్యారెక్టర్ల రూపంలో మాత్రమే కనిపించిన ఈ ఎడ్వెంచరస్ ఫాంటసీ స్టోరి ఇప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్లతో రానుంది. ఐరన్ మేన్ లాంటి యాక్షన్ సినిమాలను అందించిన దర్శకుడు జాన్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారత్లో వేసవి కానుకగా ఏప్రిల్ 15లో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మరో అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

భారతీయ సినిమా అభిమానులకు సుపరిచితుడైన మోగ్లీ పాత్రలో భారతీయ మూలాలున్న నటుడు నీల్ సేథి నటిస్తున్నాడు. మోగ్లీ అతని తల్లిదండ్రుల పాత్రలు తప్ప మిగతా అన్ని జంతువులు 3డి యానిమేషన్లో రూపొందించారు. ఇక సినిమాలో కనిపించనున్న జంతువులకు హాలీవుడ్ స్టార్స్ బిల్ ముర్రే, బెన్ కింగ్స్లే, స్కార్లెట్ జాన్సన్ లాంటి వారు డబ్బింగ్ చెప్పటం కూడా సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. వాల్ట్ డిస్నీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement