యూత్‌ కోసం రియాలిటీ షో | Tharuvatha Evaru Trailer Launch | | Sakshi
Sakshi News home page

యూత్‌ కోసం రియాలిటీ షో

May 4 2018 12:25 AM | Updated on May 4 2018 12:25 AM

Tharuvatha Evaru Trailer Launch | - Sakshi

మనోజ్, ప్రియాంక శర్మ

‘ఫస్ట్‌ టైమ్‌ మన యూత్‌ కోసం తెలుగులో ఒక రియాలిటీ షో వచ్చిందిరా’ అంటూ ప్రారంభమయ్యే ‘తరువాత ఎవరు’ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కమల్‌ కామరాజు, భరణి, మనోజ్, ప్రియాంక శర్మ, యషికా మౌల్కర్, సాయి కిరణ్‌ ముఖ్య తారలుగా జి.కృష్ణప్రసాద్, కె.రాజేష్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. హ్యాపీ ఎండింగ్‌ క్రియేషన్స్‌ పతాకంపై లక్ష్మిరెడ్డి కె., రాజేష్‌ కోడూరి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ– ‘‘తరువాత ఎవరు’ టైటిల్‌లోనే సినిమా కథ మొత్తం ఉంది. ట్రైలర్‌ చూసిన వారందరూ చాలా గ్రిప్పింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉందని అంటున్నారు. అదే థ్రిల్‌ సినిమా మొత్తం ఉంటుంది. తప్పకుండా యువతను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘థ్రిల్లర్‌ సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ, మా థ్రిల్లర్‌ సినిమా వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది’’ అన్నారు ప్రధాన పాత్రధారులు. సంగీత దర్శకుడు విజయ్‌ కురాకుల, ఎడిటర్‌ ఆవుల వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement