వచ్చిన కాసేపటికే ఎలిమినేషన్.. బిగ్‌బాస్‌లో 'బాక్స్' డ్రామా | Bigg Boss 9 Telugu Contestants: Who Is Bharani Shankar, Know About His Details And Secret Chain Box Twist On Stage | Sakshi
Sakshi News home page

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌లోకి రాగానే ఎలిమినేషన్.. కానీ

Sep 7 2025 10:40 PM | Updated on Sep 7 2025 11:33 PM

Bigg Boss 9 Telugu Bharani Details

కోపపు నీడలో పెరిగిన తన ఆవేశమే అస్తిత్వంగా మారిపోయింది. సినిమా సామ్రాజ్యంలో చోటు దక్కింది. అందరూ ద్వేషించడానికి ఇష్టపడే పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయాడు. అందరూ ద్వేషించే దారిలో నడుస్తుండగా ఓ ప్రశ్న ఎదురైంది. దానికిచ్చిన సమాధానంతో అతడి జీవితమే మారిపోయింది. కన్నతల్లి చేయూతనిచ్చింది. దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు కూడా భయపడేవాళ్లు.

ఆవేశంతో రాజ్యమేలిన వ్యక్తి మనసు ఏలేందుకు ముందుకొస్తున్నాడు. ఓ గిఫ్ట్‌ బాక్స్‌తో హౌస్‌లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ బాక్స్‌ తీసుకెళ్లేందుకు వీల్లేదన్నారు. అందుకు భరణి ఒప్పుకోలేదు. ఈ బాక్స్‌ కూడా నా శరీరంలో ఒక భాగం అని, దాన్ని వదిలేసి వెళ్లలేనన్నాడు. అలాగైతే బాక్స్‌ తీసుకోమని ఇంటికెళ్లిపోమంటే అందుకు క్షణం ఆలోచించకుండా సరేనని తలూపాడు.

పోనీ, ఆ బాక్స్‌ వెనక సీక్రెట్‌ ఏంటో చెప్పి, ఆ చైన్‌ మెడలో వేసుకుని వెళ్లమంటే కూడా అందుకు భరణి ఒప్పుకోలేదు. ఈ స్టేజీపై ఆ రహస్యాన్ని బయటపెట్టలేనన్నాడు. దాంతో అతడిని స్టేజీపై నుంచి బయటకు పంపించారు. కానీ మరికాసేపటికే భరణిని లోనికి పంపించారు. అయితే ఇక్కడ ఇంకాస్త డ్రామా పండించే ఛాన్స్ ఉన్నాసరే బిగ్‌బాస్ ఎందుకో త్వరగానే భరణిని త్వరగా లోపలికి పంపించేయడం మాత్రం కాస్త అసంతృప్తిగా అనిపించింది.

అప్పట్లో 'చిలసౌ స్రవంతి' సీరియల్‌తో విలన్‌గా చేసి అందరినీ భయపెట్టిన భరణి.. తర్వాత ఎన్నో సినిమాలు చేసినా సరే 'స్రవంతి' విలన్‌గానే గుర్తుండిపోయాడు. ఇప్పడు బిగ్‌బాస్ షోలోకి వచ్చి తనని తాను మరోసారి నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఎన్ని వారాల పాటు ఉంటాడో చూడాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement