గోల్‌మాల్‌ చేస్తున్న తమన్‌ | Thaman to make Bollywood debut with 'Golmaal Again' | Sakshi
Sakshi News home page

గోల్‌మాల్‌ చేస్తున్న తమన్‌

May 16 2017 11:30 PM | Updated on Apr 3 2019 6:34 PM

గోల్‌మాల్‌ చేస్తున్న తమన్‌ - Sakshi

గోల్‌మాల్‌ చేస్తున్న తమన్‌

అవునండీ... నిజమే తమన్‌ గోల్‌మాల్‌తో బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని అయనే స్వయంగా చెప్పారు. గోల్‌మాల్‌ అంటే ఏదో జిమ్మిక్‌ అనుకునేరు.

అవునండీ... నిజమే తమన్‌ గోల్‌మాల్‌తో బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని అయనే స్వయంగా చెప్పారు. గోల్‌మాల్‌ అంటే ఏదో జిమ్మిక్‌ అనుకునేరు. స్రై్టట్‌గా చెప్పాలంటే బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి తెరకెక్కించనున్న ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ చిత్రానికి తమన్‌ సంగీత దర్శకునిగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రంలో అజయ్‌ దేవ్‌గన్, పరిణితి చోప్రా జంటగా నటిస్తున్నారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘సింగమ్‌ రిటర్న్స్‌’, ‘దిల్‌వాలే’ వంటి హిట్‌ చిత్రాలతోపాటు, బంపర్‌హిట్‌ ‘గోల్‌మాల్‌’ సిరీస్‌కు రోహిత్‌ శెట్టినే డైరెక్టర్‌. 2008లో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన తమన్‌ మాస్‌ బీట్స్‌తో సౌత్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’తో నార్త్‌లో కూడా నిరూపించుకుని, ఎగైన్‌ అండ్‌ ఎగైన్‌ అవకాశాలు తెచ్చుకుంటారేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement