షిరిడీలో అజిత్ | Sakshi
Sakshi News home page

షిరిడీలో అజిత్

Published Sat, May 3 2014 11:50 PM

షిరిడీలో అజిత్

 షిరిడీలోని సాయిబాబా ఆలయంలో నటుడు అజిత్ పూజలు నిర్వహించారు. వీరం చిత్రం తర్వాత గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో అజిత్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు సూచించలేదు. ‘ఆయిరం తోట్టాక్కళ్’, ‘తుడిక్కుదు భుజం’ వంటి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అజిత్‌కు జోడిగా అనుష్క నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.  ఈ చిత్రంలో ‘నాలు నాళ్‌ల ఊరే క్రిస్తుమస్ కొండాడుం, యణక్కు మట్టుం అన్నైక్కు దీపావళిడా’ అంటూ అజిత్ మాట్లాడే పంచ్ డైలాగ్ చిత్రంలో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.
 
 ఈ చిత్రం షూటింగ్ కోసం పూణె వెళ్లిన సమయంలో అజిత్ షిరిడీ సాయిబాబా ఆలయానికి వెళ్లినట్లు తెలిసింది. తన పుట్టిన రోజు సందర్భంగా బాబా దర్శనం చేసుకున్న అజిత్ ఆలయంలో చాలా సేపు గడిపారు. తర్వా త అక్కడి నుంచి వెళ్లారు. నిర్మాత ఏఎం రత్నం చెన్నై సాలిగ్రామంలో సాయిబాబా ఆలయం నిర్మించారు. అక్కడికి అజిత్ తరచుగా వెళ్లి వస్తుంటారు. దీని ద్వారా సాయిబాబా భక్తునిగా మారారు. దీని తర్వాత ప్రస్తుతం షిరిడీ సాయిబాబా ఆలయానికి వెళుతున్నారు.  
 

Advertisement
 
Advertisement