టెంపర్‌లో బ్లాక్‌ బస్టర్‌ | temper tamil remake in vishal | Sakshi
Sakshi News home page

టెంపర్‌లో బ్లాక్‌ బస్టర్‌

Mar 1 2019 1:07 AM | Updated on Mar 1 2019 1:07 AM

temper tamil remake in vishal - Sakshi

శ్రద్ధాదాస్‌

‘బ్లాకు బస్టర్‌.. బ్లాకు బస్టరే.. నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాకుబాస్టరే...’ అంటూ సాగే ఈ స్పెషల్‌ సాంగ్‌ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ‘సరైనోడు’ సినిమాలో ఈ పాటకు అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పులకు తెలుగులో ఫుల్‌ విజిల్స్‌ పడ్డాయి.  ఇప్పుడీ ట్యూన్‌ తమిళ్‌లో వినిపించనుంది. తమిళ వెర్షన్‌ ‘బ్లాక్‌బస్టర్‌..’ పాటకు విశాల్‌ డ్యాన్స్‌ చేయనున్నారు. ఎన్టీఆర్‌ సూపర్‌ హిట్‌ ‘టెంపర్‌’ చిత్రం తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్‌ అవుతోంది. ఇందులో విశాల్, రాశీఖన్నా జంటగా నటిస్తున్నారు.

మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌ మోహన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఠాగూర్‌’ మధు నిర్మాత. ‘టెంపర్‌’ సినిమాలో వచ్చే ‘ఇట్టాగె రెచ్చిపోదాం పిల్లా’ పాట ప్లేస్‌లో ‘బ్లాక్‌ బస్టర్‌’ సాంగ్‌ ట్యూన్‌ను వాడుకుంటున్నారట. ఈ స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేయడానికి తొలుత సన్నీ లియోన్, శ్రుతీహాసన్‌ పేర్లు వినిపించాయి. లేటెస్ట్‌గా ఈ సాంగ్‌లో విశాల్‌తో శ్రద్ధాదాస్‌ కాలు కదుపుతున్నారట. ఈ స్పెషల్‌ సాంగ్‌తోనే శ్రద్ధ తమిళ ఎంట్రీ ఇవ్వనున్నారు. సమ్మర్‌లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్‌ సి యస్‌.

Advertisement
 
Advertisement
Advertisement