‘96’ రీమేక్‌ టైటిల్‌ ఫిక్స్‌!

Telugu Remake Of 96 Movie Title Is Confirmed As Janaki Devi - Sakshi

తమిళ నాట సెన్సేషన్‌ సృష్టించిన 96 మూవీని టాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నటించిన విజయ్‌ సేతుపతి, త్రిషలకు ఎనలేని క్రేజ్‌ ఏర్పడింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. రికార్డులు సృష్టించింది. అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ చేసినా.. హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో దూసుకుపోయింది. మొత్తంగా ఈ చిత్రం కోలీవుడ్‌లో ఓ క్లాసికల్‌ కల్ట్‌గా నిలిచిపోయింది.

అటువంటి సినిమాకు తెలుగులో రీమేక్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి తమిళంలో తెరకెక్కించిన సి.ప్రేమ్‌ కుమార్‌ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. శర్వానంద్‌, సమంతలు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో తెలుగు నెటివిటీకి దగ్గరగా ఉండేట్టు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే.. ఈ చిత్ర టైటిల్‌ను ఈమధ్యే ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. ‘జానకీ దేవీ’ అనే టైటిల్‌ను ఈ మూవీ కోసం రిజిష్టర్‌చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిపై చిత్రయూనిట్‌ స్పందించాల్సి ఉంది. ఈ మూవీ  షూటింగ్‌ ఏప్రిలో మొదలయ్యే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top