వినోదం... సందేశం

Telangana Devudu Movie Launch - Sakshi

ప్రముఖ దర్శకుడు సాగర్‌ వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన హరీష్‌ వడ్‌త్యా దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ, అలీ, సుమన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాక్‌ ల్యాబ్స్‌ పతాకంపై మహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సాగర్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించగా, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొయినుద్దీన్‌ క్లాప్‌ ఇచ్చారు. ఎస్‌.ఎ. గ్రూప్‌ చైర్మన్‌ సయ్యద్‌ అక్తర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు హరీష్‌ వడ్‌త్యా మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం కామెడీతో ఆకట్టుకునే చిత్రమిది. మంచి మెసేజ్‌ కూడా ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉంటా యి’’ అన్నారు. ‘‘నిర్మాతగా నా మొదటి సినిమా ‘తెలంగాణ దేవుడు’. మంచి మెసేజ్‌ ఉన్న కథతో నిర్మాతగా మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం’’ అన్నారు మహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌. ప్రగతి, ప్రభావతి, తోటపల్లి మధు, కోటేశ్‌ మానవ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నందన్‌ రాజ్‌ బొబ్బిలి, కెమెరా: ఎ. విజయ్‌ కుమార్‌.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top