వర్షంలో హోరాహోరీ | teja's film hora hori | Sakshi
Sakshi News home page

వర్షంలో హోరాహోరీ

Jun 28 2014 1:11 AM | Updated on Sep 2 2017 9:27 AM

వర్షంలో హోరాహోరీ

వర్షంలో హోరాహోరీ

తెలుగుతెరపై దర్శకునిగా తేజది ఓ ప్రత్యేకమైన సంతకం.

తెలుగుతెరపై దర్శకునిగా తేజది ఓ ప్రత్యేకమైన సంతకం. కొత్త ప్రతిభను తెరకు పరిచయం చేయడంలోనూ తేజ ఎప్పుడూ ముందుంటారు. ఆయన పరిచయం చేసిన తారల గురించి చెప్పాలంటే... పెద్ద లిస్టే అవుతుంది. ప్రస్తుతం మరో యంగ్ టాలెంట్‌ని తెరకు పరిచయం  చేసే పనుల్లో బిజీగా ఉన్నారు తేజ.

 ‘హోరా హోరీ’ పేరుతో ఓ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దిలీప్ అనే యువ నటుణ్ణి హీరోగా పరిచయం చేయనున్నారు. విశేషం ఏంటంటే.. కథ రీత్యా ఈ చిత్రం ఆసాంతం వర్షంలోనే ఉంటుంది. అందుకే సన్నివేశాలు సహజంగా ఉండటం కోసం వర్షాకాలంలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement