టాటూలతో తిప్పలే! | Tattoo is covered to make Much makeup look better | Sakshi
Sakshi News home page

టాటూలతో తిప్పలే!

Jun 18 2017 12:32 AM | Updated on Apr 4 2019 4:44 PM

టాటూలతో తిప్పలే! - Sakshi

టాటూలతో తిప్పలే!

మణికట్టుపై ఒకటి... చెవి వెనక ఒకటి... వీపుపై ఇంకొకటి... కాలి మీద మరొకటి... భుజంపై మళ్లీ ఒకటి... మొత్తంగా ఒంటిపై ఐదు పచ్చబొట్లు పొడిపించుకున్నారు శ్రుతీహాసన్‌.

మణికట్టుపై ఒకటి... చెవి వెనక ఒకటి... వీపుపై ఇంకొకటి... కాలి మీద మరొకటి... భుజంపై మళ్లీ ఒకటి... మొత్తంగా ఒంటిపై ఐదు పచ్చబొట్లు పొడిపించుకున్నారు శ్రుతీహాసన్‌. ఇప్పుడు సై్టలుగా ‘టాటూలు’ అంటున్నారు కదా... పచ్చబొట్లంటే అవే.

ఈ ఐదింటికి తోడుగా మీ ఒంటిపై ఆరో పచ్చబొట్టు ఎప్పుడు చేరుతుంది? ఇంకో టాటూ ఎప్పుడు వేయించుకుంటారు? అని శ్రుతీని అడిగితే... ‘‘ఇక చాలు! ఈ ఐదు టాటూలు వేయించుకున్నందుకు చాలా బాధపడుతున్నా. ముఖ్యంగా మణికట్టుపై టాటూతో అయితే మరీ ఎక్కువ బాధపడుతున్నా. దీన్ని కవర్‌ చేయడానికి టూ మచ్‌గా మేకప్‌ వేసుకోవలసి వస్తుంది’’ అన్నారు. హీరోయిన్లకు టాటూలతో ఇలాంటి తిప్పలు తప్పవన్న మాట.

Advertisement
 
Advertisement
Advertisement