క్రైం థ్రిల్లర్ కథా చిత్రంగా తప్పుదండ | Sakshi
Sakshi News home page

క్రైం థ్రిల్లర్ కథా చిత్రంగా తప్పుదండ

Published Sat, Oct 29 2016 1:47 AM

క్రైం థ్రిల్లర్ కథా చిత్రంగా తప్పుదండ - Sakshi

ఎన్నికలు, నలుగురు దొంగలు, కథానాయకి తన బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమ కలాపాలు అంటూ మూడు వేర్వేరు కోణాల్లో సాగే విభిన్న కాథా చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం తప్పుదండ అని చిత్ర దర్శకుడు శ్రీకాంత్ తెలిపారు.దివంగత ప్రఖ్యాత చాయగ్రహకుడు, దర్శకుడు బాలుమహేంద్ర శిష్యుడైన ఈయన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. క్లాప్‌బోర్ట్ ప్రొడక్షన్‌‌స పతాకంపై సత్యమూర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్య, శ్వేతాగై హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇతర ముఖ్య పాత్రలో ్లజాన్‌విజయ్, మైన్‌గోపి, అజయ్‌ఘోష్, ఈ.రామదాస్, మెడ్రాస్వ్రి, మహేంద్రన్, నాగ, సంజీవి, అశ్విత ప్రియ, జీవారవి, ఆత్మ నటిస్తున్నారు.వినోద్‌భారతి చాయాగ్రహణం, నరేన్ బాలకుమారన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. ఇందులో నటుడు జాన్‌విజయ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్నారు. తనది దొంగలకు శిక్షణ ఇచ్చే విశ్వవిద్యాలయానికి అధినేత పాత్ర అని తెలిపారు. ఇక చిత్ర కథానాయకుడు కూత్తుపట్టరైలో శిక్షణ పొంది తన పాత్రకు చక్కగా న్యాయం చేశారన్నారు. చిత్రం ప్రథమార్థం హాస్యభరితంగానూ ద్వితీయార్థం క్రైమ్‌థ్రిల్లర్‌గానూ సాగుతుందని తెలిపారు. విభిన్న కథాకథనాలతో తెరకెక్కిస్తున్న తమ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం యూనిట్‌లోని అందరికీ ఉందని దర్శకుడు అన్నారు.
 

Advertisement
 
Advertisement