లై డిటెక్టర్‌ ఉపయోగించండి

Tanushree Dutta's counsel demands lie detector tests on Nana Patekar - Sakshi

లైంగిక వేధింపుల గురించి అటు బాలీవుడ్‌లో తనుశ్రీదత్తా, తనతో చెప్పుకున్న వాళ్లకు జరిగిన వేధింపుల విషయమై ఇటు సౌత్‌లో గాయని చిన్మయి ఇద్దరూ ‘మీటూ’ ఉద్యమంలో తమ పోరాటం సాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ ఆరోపించిన నానా పటేకర్, వైరముత్తులను ఒకే విధంగా ఇన్వెస్టిగేట్‌ చేయమని కోరుతున్నారు. ‘వైరముత్తుగారూ.. మాట్లాడింది చాలు. ఆయన లై డిటెక్టర్‌ టెస్ట్‌ తీసుకోవాలి’’ అని ట్వీట్‌ చేశారు చిన్మయి. మరోవైపు తనుశ్రీ కూడా నానా పటేకర్‌కు లై డిటెక్టర్‌ టెస్ట్, నార్కో అనాలసిస్‌ పరీక్షలు చేయించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారట. ఇందులో నృత్య దర్శకుడు గణేశ్‌ ఆచార్య, నిర్మాత రాకేశ్‌ సారంగ పేర్లు కూడా ఉన్నాయని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top