రాఖీ సావంత్‌కి తనుశ్రీ కౌంటర్‌ | Tanushree Dutta files for defamation against Rakhi Sawant | Sakshi
Sakshi News home page

రాఖీ సావంత్‌కి తనుశ్రీ కౌంటర్‌

Oct 22 2018 4:22 PM | Updated on Oct 22 2018 4:45 PM

Tanushree Dutta files for defamation against Rakhi Sawant - Sakshi

దీనికి రాఖీ సమాధానం చెప్పకపోతే, ఆమెకు రెండు సంవత్సరాలు శిక్ష విధించే అవకాశం ఉంది.

సాక్షి, ముంబై: లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనం రేపిన నటి తనుశ్రీ దత్తా మరో కీలక అడుగు వేశారు. తనుశ్రీ -నానా పటేకర్‌ వివాదంలో నానాకు మద్దతుగా నిలవడంతోపాటు తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాఖీ సావంత్‌ను  చట్టపరంగా సవాల్‌ చేసింది. 10 కోట్ల రూపాయల విలువైన పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు తనుశ్రీ న్యాయవాది నితిన్ మీడియాకు తెలిపారు. దీనికి రాఖీ సమాధానం చెప్పకపోతే, ఆమెకు రెండు సంవత్సరాలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.

తనుశ్రీ దత్తా ఆరోపణలపై పచ్చి అబద్ధాల కోరు అంటూ బాలీవుడ్  రాఖీ సావంత్ తీవ్రంగా స‍్పందించింది. ముఖ్యంగా హారన్‌ ఓకే ప్లీజ్‌ మూవీ షూటింగ్‌ రోజు తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో 4 గంటల పాటు స్పృహ లేకుండా పడివుండడంతోనే తనతో ఆ పాట పూర్తి చేశారంటూ తనుశ్రీపై ఎదురు దాడికి దిగింది. ‘నానా ప‌టేకర్ లాంటి గొప్ప నటుణ్ని తనుశ్రీ అవ‌మానిస్తోంది. ఆయన చాలా గొప్ప వ్య‌క్తి. ఆయ‌న‌ మ‌హిళ‌ల‌తో చాలా గౌర‌వంగా ప్రవర్తిస్తార’ని రాఖీ తెలిపింది. అంతేకాదు తనుశ్రీ దత్తా  రక్తం నిండా మత్తుమందులే ఉంటాయని తెలిపింది. కేవలం ప‌బ్లిసిటీ కోస‌మే ఇన్నేళ్ల త‌ర్వాత త‌నుశ్రీ ఇలా మాట్లాడుతోందని పేర్కొంది. ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడుతోంది కాబ‌ట్టి తనుశ్రీ మాట‌ల‌కు ప్రాధాన్యం ల‌భిస్తోంది. రుజువులు చూపిస్తే  తాను ఇండియా వదిలిపోతానని, ఆమె చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మైతే తన ముందుకు వ‌చ్చి మాట్లాడాల‌ంటూ రాఖీ స‌వాల్ చేసిన సంగతి విదితమే. దీంతో రాఖీపై రూ. 10 కోట్ల మేరకు తనుశ్రీ పరువునష్టం దావా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement