మలేషియాలో బుల్లితెర నటీనటుల స్టార్‌నైట్‌

Tamil Tv Artists Star Night in Malaysia - Sakshi

మలేషియాలో బుల్లితెర నటీనటుల సంఘం బ్రహ్మాండంగా స్టార్‌ నైట్‌ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి ఆ సంఘం అధ్యక్షుడు రవివర్మ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ బుల్లితెర దివంగత నటుడు ఎస్‌ఎన్‌.వసంత్‌ ప్రయత్నంతో 2003లో బుల్లితెర నటీనటుల సంఘం ఏర్పడిందని తెలిపారు. కాగా ఇన్నేళ్లుగా సంఘాన్ని నడుపుతున్నా, సంఘానికి పెద్దగా నిధిగానీ, భవనాన్ని గానీ ఏర్పరచుకోలేకపోయామన్నారు.

ఆ కొరతను తీర్చడానికే బుల్లితెర నటీనటుల సంఘం తరఫున మలేషియాలో స్టార్‌నైట్‌ కార్యక్రమాన్ని నిర్వహించి నిధిని సేకరించతలపెట్టామని తెలిపారు. సంఘసభ్యుల సంక్షేమం కోసం ఆగస్ట్‌ 17న ఈ స్టార్‌నైట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. మలేషియాలోని షా అలామ్‌ సిలాంగర్‌ మెలావాటి గ్రౌండ్‌లో ఈ స్టార్‌నైట్‌ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో బుల్లితెర నటీనటులతో పాటు వెండితెర నటీనటులు పలువురు పాల్గొననున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నటుడు నాజర్, ఐసరిగణేశ్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top