
తమిళ నటుడి ఆత్మహత్య
తమిళ నటుడు బాల మురళీమోహన్ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం రాత్రి చెన్నైలో పురసవాక్కమ్‌లోని తన ఇంటిలో ఉరి వేసుకొని ఆయన ప్రాణాలు తీసుకున్నారు.
తమిళ నటుడు బాల మురళీమోహన్ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం రాత్రి చెన్నైలో పురసవాక్కమ్‌లోని తన ఇంటిలో ఉరి వేసుకొని ఆయన ప్రాణాలు తీసుకున్నారు. ఆయన వయసు 54 ఏళ్ళు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ‘బాయ్స్’ చిత్రంతో సహా పలు తమిళ చిత్రాల తెలుగు అనువాదాల ద్వారా ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. ‘అల్లిత్తంద వానమ్’ లాంటి తమిళ చిత్రాలు, అనేక వాణిజ్య ప్రకటనల ద్వారా జనానికి ఆయన జనానికి దగ్గరయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ఈ తీవ్రమైన చర్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, ఆత్మహత్యకు కారణాలు తెలుసుకొనేందుకు దర్యాప్తు సాగిస్తున్నారు.