ఆమెకు 30.. అతనికి 19! | Wife commits suicide due to husbands behaviour | Sakshi
Sakshi News home page

ఆమెకు 30.. అతనికి 19!

Aug 11 2025 5:24 AM | Updated on Aug 11 2025 5:24 AM

Wife commits suicide due to husbands behaviour

జూన్‌లో ప్రేమ వివాహం 

భర్త వేధింపులతో ఆత్మహత్య  

కాటారం: ఆమె వయసు 30.. అతని వయసు 19. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అంగరాజ్‌పల్లికి చెందిన దుర్గం సరళ(30).. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల జాడి రాజేశ్‌ గత జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 

బతుకుతెరువు నిమిత్తం కాటారం మండల కేంద్రానికి వచ్చి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజేశ్‌ కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. ఈక్రమంలో రాజేశ్‌ను కుటుంబ సభ్యులు ఉసిగొల్పడంతో.. సరళను హింసించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరళ శనివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement