పక్కా ప్లానింగ్‌!

Tamanna Walked Out From Raju Gari Gadhi 3 - Sakshi

ఇటు సౌత్‌ అటు నార్త్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటున్నారు తమన్నా. ఇక్కడ సినిమాలు కమిట్‌ అవుతూ అక్కడి సినిమాలకు కూడా డేట్స్‌ ఇస్తూ పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో వెళుతునాన్రు. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం  ‘ఖామోషి’ చిత్రంలో కనిపించిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్‌లో మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘బోలె చూడియా’లో తమన్నా నాయికగా నటించనున్నారట. ఈ సినిమాతో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ సోదరుడు షమాస్‌ నవాబ్‌ సిద్ధిఖీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

రొమాంటిక్‌ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో తొలుత మౌనీ రాయ్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. అయితే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం తమన్నాకి దక్కింది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్యపై ఈ చిత్రకథ ఉంటుందట. కాగా, ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘రాజుగారి గది 3’ నుంచి తమన్నా తప్పుకున్నారని ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. ‘సైరా’లో ఆమె ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. తమిళంలో సుందర్‌ .సి దర్శకత్వంలో ఓ సినిమా, ‘ఆనందో బ్రహ్మ’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top