తమన్నా ఐటెం సాంగ్?

తమన్నా ఐటెం సాంగ్? - Sakshi


హీరోయిన్గా వెలుగొందుతున్న తమన్నా ప్రత్యేక గీతంలో కనిపించనుందని గుసగుసలు విన్పిస్తున్నాయి. సమంతా సినిమాలో ఈ శ్వేత సుందరి ఐటెం సాంగ్ చేయనుందని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమవుతున్న సినిమాలో తమన్నా ప్రత్యేక పాటలో కనిపించనుందని ఫిలింనగర్ టాక్.మొదట ఈ సినిమాలో సమంతా, తమన్నాలను హీరోయిన్లుగా తీసుకోవాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో స్క్రిప్ట్లో మార్పులు చోటుచేసుకోవడంతో తమన్నాను తప్పించారు. సమంతాకు హీరోయిన్ ఛాన్స్ దక్కింది. రొమాంటిక్ మ్యూజికల్ తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top