ఆమె బయోపిక్‌లో నటించాలని ఉంది | Sakshi
Sakshi News home page

ఆమె బయోపిక్‌లో నటించాలని ఉంది

Published Thu, Jun 13 2019 12:37 AM

Tamanna to be act in Sridevi's Biopic - Sakshi

నటిగా తమన్నాకు రెండే రెండు కోరికలు ఉన్నాయట. అయితే ఇవి బాలీవుడ్‌కి సంబంధించినవి. ఒకటి ప్రముఖ నటి శ్రీదేవి జీవిత చరిత్రలో నటించాలన్న కోరిక. మరోటి హిందీలో పూర్తి స్థాయి డ్యాన్స్‌ బేస్డ్‌ మూవీలో నటించాలని కోరిక. ఇవి ఎప్పుడు తీరుతాయో చూడాలి. ఆ సంగతలా ఉంచితే.. శ్రీదేవి జీవిత చరిత్రలో తమన్నా ఎందుకు నటించాలనుకుంటున్నారంటే.. చిన్నప్పటి నుంచి ఆమె సినిమాలనూ చూస్తూ పెరిగానని, ఆమె అందం, నటన అద్భుతం అనీ తమన్నా అంటున్నారు. శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం మరోటి లేదని కూడా పేర్కొన్నారు తమన్నా.

అయితే గతంలో శ్రీదేవి నటించిన ‘హిమ్మత్‌వాలా’ రీమేక్‌లో తమన్నా నటించారు. ఆ సినిమా అపజయం పాలైంది. అది వేరే విషయం. చిన్నప్పటి నుంచి ఆరాధించిన మనిషి తిరిగి రాని లోకాలకు వెళ్లడం చాలా బాధాకరం అని కూడా తెలిపారు. ఇవన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె. అదే ఇంటర్వ్యూలో ప్రభాస్‌ గురించిన ప్రస్తావన వచ్చింది. ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ సరసన తమన్నా ‘రెబల్‌’, ‘బాహుబలి’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ చాలా సాఫ్ట్‌ అని, దయాగుణం ఉన్నవాడని తమన్నా చెప్పారు. అది మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లాడాలనుకుంటున్నారని ఈ మిల్కీబ్యూటీ చెప్పడం విశేషం.

Advertisement
Advertisement