థప్పడ్‌ ట్రైలర్‌ 2 వచ్చేసింది.. కానీ ఓ ట్విస్ట్‌ | Taapsee Pannu Shares Thappad Trailer 2 | Sakshi
Sakshi News home page

థప్పడ్‌ ట్రైలర్‌ 2 వచ్చేసింది.. కానీ ఓ ట్విస్ట్‌

Feb 12 2020 10:28 AM | Updated on Feb 13 2020 8:52 PM

Taapsee Pannu Shares Thappad Trailer 2 - Sakshi

ముల్క్‌, ఆర్టికల్‌ 15 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న​ చిత్రం థప్పడ్‌.. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రామ్‌‌కపూర్, కుముద్ మిశ్రా తదితరులు నటించారు.. జనవరి 31న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్‌పై ప్రముఖులందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ను చూసిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తాప్సీ నటనను అభినందించారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న భార్యాభర్తలు సంతోషంగా కాలాన్ని గడుపుతారు. అయితే కోపంలో భర్త ఓ రోజు పార్టీలో అందరి ముందు భార్య చెంప చెళ్లుమనిపిస్తాడు. దీంతో షాక్‌కు గరైన తాప్సీ భర్త నుంచి విడాకులు కోరుతుంది. ప్రేమించే భర్త కొడితే సర్ధుకుపోవాలి కానీ కోర్టు వరకు వెళ్తావా అని అందరూ అంటుంటారు. కానీ తనకు ప్రేమ కావాలి. గౌరవం కావాలి అని చెబుతుంది. ఇక చివరికి ఏం జరిగిందనేది కథాంశం.  (వేరే సంబంధాలు ఉన్నాయా.. ఒక్క చెంపదెబ్బే కదా!)

ఇక ట్రైలర్‌ పై విశేష స్పందన లభించడంతో చిత్ర యూనిట్‌ తాజాగా సినిమాకు సంబంధించిన  మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో కాస్త ట్విస్ట్‌ పెట్టారు. మొదటి ట్రైలర్‌ను జోడిస్తూ.. భర్త తాప్సీని కొట్టిన అనంతరం .. ఆమె కెమెరా వైపు చూసి మాట్లాడుతూ..  ‘‘తరువాత సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నారా.. మహిళపై ఇలాంటి హింసను నేను సహించను. మీరు కూడా సహించకండి.. వెంటనే ఈ చర్యలపై యూట్యూబ్‌కు రిపోర్ట్‌ చేయండి.’ అంటూ సూచించారు. కాగా ఇదంతా సినిమా ప్రమోషన్లలో ఒక భాగంగా తెలుస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.(కోడళ్లకు ఎంత మంది ఇలా చెప్పి ఉంటారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement