నిర్మాత స్వర | Swara Bhasker turns producer | Sakshi
Sakshi News home page

నిర్మాత స్వర

Jan 27 2019 2:54 AM | Updated on Jan 27 2019 2:54 AM

Swara Bhasker turns producer - Sakshi

బాలీవుడ్‌లో కథానాయికలు నిర్మాతలుగా మారే జాబితా పెరుగుతోంది. ఆల్రెడీ ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేశారు. ఈ ఏడాది ‘చప్పాక్‌’ సినిమాతో దీపికా పదుకోన్‌ కూడా నిర్మాతగా మారనున్నారన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి స్వరా భాస్కర్‌ చేరారు. ‘‘నిర్మాతగా మారాలన్న ఆలోచన నాకు ఏడాదిన్నర క్రితమే వచ్చింది. ప్రస్తుతం ఆ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాం. వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేయడం, కొత్తవారిని ప్రోత్సహించడమే నిర్మాతగా నాకు ఉన్న ప్రస్తుత లక్ష్యాలు’’ అని స్వరా భాస్కర్‌ పేర్కొన్నారు. గతేడాది జూన్‌ 1న విడుదలైన ‘వీరే ది వెడ్డింగ్‌’ స్వరా భాస్కర్‌’ తెరపై కనిపించిన చివరి చిత్రం.

Advertisement
 
Advertisement
Advertisement