సస్పెన్స్‌ సుందరి | suvarna sundari released on may 31 | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ సుందరి

May 12 2019 1:50 AM | Updated on May 12 2019 1:50 AM

suvarna sundari released on may 31 - Sakshi

పూర్ణ

జయప్రద, పూర్ణ, సాక్షీచౌదరి ప్రధానపాత్రల్లో సూర్య ఎమ్‌.ఎస్‌.ఎన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్‌.టీమ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌. లక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్య ఎమ్‌.ఎస్‌.ఎన్‌ మాట్లాడుతూ– ‘‘సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఏడాది పట్టింది. అయితే సినిమా ఔట్‌పుట్‌ మాత్రం చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ నెలలోనే పాటలను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. పబ్లిసిటీ కూడా విభిన్నంగా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాంకేతికంగా అద్భుతంగా మా సినిమా నిర్మించాం. తెలుగు, కన్నడ, తమిళ్‌ భాషల్లో ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం’’ అని లక్ష్మి అన్నారు. ఇంద్ర, రామ్‌ మద్దుకూరి, సాయికుమార్, కోటా శ్రీనివాసరావు, ముక్తర్‌ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్‌ తదితరులు నటì ంచిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీ్తక్, కెమెరా: ఎల్లుమహంతి.

Advertisement
 
Advertisement
Advertisement