సునీల్ సరసన ఇద్దరు హీరోయిన్లు! | Sushma, Richa to romance Sunil in new film | Sakshi
Sakshi News home page

సునీల్ సరసన ఇద్దరు హీరోయిన్లు!

Jan 4 2016 12:10 PM | Updated on Aug 25 2018 5:38 PM

సునీల్ సరసన ఇద్దరు హీరోయిన్లు! - Sakshi

సునీల్ సరసన ఇద్దరు హీరోయిన్లు!

ఒక హీరోయిన్ కంటే ఇద్దరైతే లక్ అని భావించారో ఏమో గానీ.. సునీల్ హీరోగా 'ఈడు గోల్డ్ ఎహే' సినిమాకు ఇద్దరు హీరోయిన్లను పెట్టారు.

చెన్నై
ఒక హీరోయిన్ కంటే ఇద్దరైతే లక్ అని భావించారో ఏమో గానీ.. సునీల్ హీరోగా 'ఈడు గోల్డ్ ఎహే' సినిమాకు ఇద్దరు హీరోయిన్లను పెట్టారు. సుష్మా రాజ్, రిచా పనాయ్.. ఈ ఇద్దరు అమ్మాయిలు సునీల్ సరసన నటిస్తారని సినిమా వర్గాలు తెలిపాయి.

పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్లికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా 'ఈడు గోల్డ్ ఎహే'. ఇందులో హీరోయిన్లిద్దరినీ ఇటీవలే కన్ఫమ్ చేశామని, ఈ సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. సినిమాను రెండు నెలల్లో పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈలోపు సునీల్ హీరోగా నటించిన మరో సినిమా 'కృష్ణాష్టమి' విడుదల కావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement