Sushma Raj
-
పాక్ లష్కరే, హిజ్బుల్ను సృష్టించింది
-
పాక్ లష్కరే, హిజ్బుల్ను సృష్టించింది
ఐక్యరాజ్యసమితి: భారతదేశం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మ విద్యాసంస్థల్ని నెలకొల్పి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వైద్యులు, ఇంజనీర్లను తయారుచేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల్ని ఉత్పత్తి చేస్తోందని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. ప్రపంచ ఐటీ శక్తిగా భారత గుర్తింపు పొందితే.. ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా పాకిస్తాన్ ఎందుకు అపఖ్యాతి పాలవుతుందో ఆ దేశ పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. 72వ ఐరాస సాధారణ అసెంబ్లీలో శనివారం సుష్మా ప్రసంగిస్తూ.. విధ్వంసం, మారణహోమం, క్రూరత్వాన్ని ప్రపంచానికి ఎగుమతి చేయడంతో పాకిస్తాన్ ముందువరుసలో ఉందని విరుచుకుపడ్డారు. అలాంటి దేశం ఐరాస వేదికపై నుంచి మానవత్వం గురించి మాట్లాడుతూ.. కపట ప్రదర్శనలో విజేతగా నిలిచిందని సుష్మా స్వరాజ్ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదం మానవజాతి అస్తిత్వానికే ప్రమాదకరమని, ఉగ్రవాదుల జాబితాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలే ఆమోదించకపోతే.. ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఎలా పోరాటం చేయగలదని ఆమె ప్రశ్నించారు. ‘కొద్ది గంటల తేడాతో భారత్, పాకిస్తాన్‌లు స్వాతంత్య్రం పొందాయి. భారతదేశం ప్రపంచ ఐటీ శక్తిగా గుర్తింపు పొందితే.. ఉగ్రవాద ఎగుమతి కేంద్రంగా పాకిస్తాన్ ఎందుకు పేరుపడింది. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్ రాజకీయ నాయకులకు నేను చెప్పాలనుకుంటున్నాను’ అని సుష్మా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోయడమే ప్రధాన లక్ష్యంగా పాకిస్తాన్ పనిచేసినా.. వాటిని అధిగమించి భారత్ పురోగమించిందని చెప్పారు. ‘స్వాతంత్య్రం అనంతరం గత 70 ఏళ్లుగా భారత్‌ను అనేక పార్టీలు పాలించాయి. ప్రతీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ఎంతో కొంత పాటుపడ్డాయి. ప్రపంచానికి గర్వకారణమైన ఐఐటీ, ఐఐఎంల్ని నెలకొల్పాం. కానీ ఉగ్రవాదం తప్ప ప్రపంచానికి పాకిస్తాన్ ఏమిచ్చింది?. మీరు ఉగ్రవాదుల్ని తయారు చేశారు. ఉగ్రవాద శిబిరాల్ని ఏర్పాటుచేశారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్‌వర్క్‌ల్ని సృష్టించారు’అని పాకిస్తాన్‌పై సుష్మా నిప్పులు చెరిగారు. ఉగ్రవాదంపై పెట్టిన సమయాన్ని అభివృద్ధి కోసం ఆ దేశం వినియోగించుంటే.. ఇప్పుడు పాకిస్తాన్, ప్రపంచం సురక్షితంగా ఉండేవని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో భారతదేశం ఒక్కటే కాకుండా.. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు కూడా నష్టపోతున్నాయని అన్నారు. మోదీ స్నేహ హస్తాన్ని ఎందుకు తిరస్కరించారు? ఐరాసలో శుక్రవారం పాక్ ప్రధాని చేసిన ఆరోపణల్ని సుష్మా తోసిపుచ్చుతూ.. శాంతి, మైత్రి కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ అందించిన స్నేహ హస్తాన్ని పాకిస్తాన్ ఎందుకు తిరస్కరించిందో సమాధానం చెప్పాలన్నారు. ‘ద్వైపాకిక్ష చర్చల ద్వారా అపరిష్కృత సమస్యల్ని పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ మేరకు భారత్–పాక్‌లు అంగీకరించిన విషయాన్ని పాక్ ప్రధాని మర్చిపోయారు. వాస్తవాల్ని మర్చిపోవడంలో పాకిస్తాన్ రాజకీయ నాయకులు సిద్ధహస్తులు’ అని సుష్మా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాగైతే ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు ఎలా.. ‘మన శత్రువు ఎవరో నిర్వచించడంలో మన మధ్య అంగీకారం లేకపోతే కలిసికట్టుగా మనం ఎలా పోరాడగలం? మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు అని తేడాల్ని కొనసాగిస్తే ఉమ్మడి పోరు ఎలా సాధ్యం?’ అని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై చైనా వైఖరిని పరోక్షంగా తప్పుపట్టారు. మసూద్‌పై నిషేధం విధించాలని ఐరాసలో భారత ప్రతిపాదనను పదే పదే భద్రతామండలి సభ్య దేశం చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఐరాసలో సుష్మా ప్రసంగం అద్భుతం: మోదీ ఐరాసలో సుష్మా స్వరాజ్ ప్రసంగాన్ని ట్విటర్లో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఉగ్రవాద ముప్పు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం అంశాలపై సుష్మా స్వరాజ్ గట్టి సందేశాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఐరాసలో భార త విదేశాంగ మంత్రి అద్భుత ప్రసంగం చేశారని, ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేశారని ప్రధాని ట్వీట్ చేశారు. పేదరిక నిర్మూలనే మా లక్ష్యం వాతావరణ మార్పులతో ఉత్పన్నమయ్యే సవాళ్లకు మాటలతో కాకుండా సరైన చేతలతో సమాధానం చెప్పాల్సిన అవసరముందని సుష్మా అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతికంగా, ఆర్థికంగా సాయం చేయాలని సూచించారు. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమని సుష్మా పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో దేశమంతా ఒకపన్ను పనువిధానం అమలు చేస్తున్నామని చెప్పారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే భారతదేశ ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. జన్‌ధన్, ముద్ర, ఉజ్వల, డిజిటల్ ఇండియా వంటివన్నీ పేదలకు సాధికారత అందించేందుకు ఉద్దేశించినవని చెప్పారు. అణ్వస్త్ర వ్యాప్తి, సముద్ర రవాణా భద్రతకు ముప్పు అంశాలపై ఐరాసలో ఆందోళన వ్యక్తం చేశారు. -
రేడియో ‘స్టార్స్’
బంజారాహిల్స్: ‘ఈడు గోల్డ్ ఎహె’ సినిమా హీరో సునీల్, హీరోయిన్లు సుష్మారాజ్, రీచాపనయ్ గురువారం రేడియో సిటీలో సందడి చేశారు. వీరు శ్రోతలతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఫుల్ కామెడీతో వస్తున్న సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని వారు తెలిపారు. -
సునీల్ సరసన ఇద్దరు హీరోయిన్లు!
చెన్నై ఒక హీరోయిన్ కంటే ఇద్దరైతే లక్ అని భావించారో ఏమో గానీ.. సునీల్ హీరోగా 'ఈడు గోల్డ్ ఎహే' సినిమాకు ఇద్దరు హీరోయిన్లను పెట్టారు. సుష్మా రాజ్, రిచా పనాయ్.. ఈ ఇద్దరు అమ్మాయిలు సునీల్ సరసన నటిస్తారని సినిమా వర్గాలు తెలిపాయి. పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్లికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా 'ఈడు గోల్డ్ ఎహే'. ఇందులో హీరోయిన్లిద్దరినీ ఇటీవలే కన్ఫమ్ చేశామని, ఈ సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. సినిమాను రెండు నెలల్లో పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈలోపు సునీల్ హీరోగా నటించిన మరో సినిమా 'కృష్ణాష్టమి' విడుదల కావాల్సి ఉంది. -
రాశిఖన్నా 'జోరు' స్టిల్స్
-
సుష్మారాజ్ 'జోరు' స్టిల్స్
-
సినిమా రివ్యూ: కొద్దిసేపే ‘మాయ’
విభిన్నమైన కథలు, వాటిని విచిత్రంగా నడిపిస్తూ తెరపై చూపే శైలి హాలీవుడ్ చిత్రాలకు అలవాటే. కానీ, అలాంటి దోవలో ప్రయాణించడం తెలుగు తెరపై అరుదు. అలాంటి అరుదైనయత్నం చేయడానికి సిద్ధపడినప్పుడు, ప్రేక్షకుడికి ఆశ్చర్యమో, ఆనందమో కలగాలి. అలాకాక, కేవలం ఇంగ్లీష్ చిత్రాల అనుసరణే వరకే ఆ ప్రయోగశీలతను పరిమితం చేస్తే, ఇబ్బంది. ఈ నేపథ్యంలో నుంచి ‘మాయ’ను చూడాలి. కథలోకి వస్తే... జరగబోయేది ముందే తెలిస్తే..? అలాంటి దృష్టి ఎవరికైనా ఉంటే..? మేఘన (అవంతికా మిశ్రా)కు చిన్నప్పటి నుంచి అతీంద్రియ దృష్టి (ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ - ఇ.ఎస్.పి) ఉంటుంది. చిన్నప్పుడు ఓ దుర్ఘటనలో అమ్మ ప్రాణాలు కోల్పోనుందన్న సంగతి కూడా చిన్నప్పుడే తెలిసిన అమ్మాయి ఆమె. పెద్దయ్యాక ‘టీవీ 21’లో రిపోర్టర్‌గా సామాజిక అంశాలపై పోరాటం చేస్తుంటుంది. ఆమె జీవితంలోకి ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ వర్మ అలియాస్ సిద్ధూ (హర్షవర్ధన్ రాణే) ప్రవేశిస్తాడు. వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇంతలో అతనికి కాబోయే భార్యనంటూ మేఘన చిన్నప్పటి ఫ్రెండ్ పూజ (సుష్మా రాజ్) ప్రవేశిస్తుంది. పూజ జీవితంలో జరగబోయే ఓ ఘటన మేఘన ఇ.ఎస్.పికి ముందే అందుతుంది. సిద్ధూకు ఓ భయంకరమైన గతం ఉందని తెలుస్తుంది. అప్పుడేమైందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే... కాస్తంత నెగటివ్ టచ్ ఉన్న పాత్రలకు ఇప్పుడిక హర్షవర్ధన్ రాణే కొత్త చిరునామాగా మారాడనుకోవచ్చు. ముగ్గురు కొత్త నాయికలూ చూడడానికైతే బాగానే ఉన్నారు. అంతకు మించి ఆశిస్తే కష్టం. సస్పెన్స్‌తో నిండిన ఈ థ్రిల్లర్‌కి సంగీతం, కెమేరా వర్క్, సౌండ్ ఎఫెక్ట్లు ప్రాణం పెట్టాయి. సందర్భోచిత గీతాలు కొన్ని పెట్టారు కానీ, అందులో ఒకటి రెండైతే నిడివినీ, ప్రేక్షకుల అసహనాన్నీ పెంచడానికే ఉపకరించాయి. ఏ సీనుకు ఆ సీనే... ఆసక్తికరమైన ప్రారంభ దృశ్యంతో వెండితెరపై ‘మాయ’ మొదలవుతుంది. అక్కడ చిన్నారి మేఘన పాత్రధారితో చేయించిన అభినయం, సౌండ్ ఎఫెక్ట్లు బాగున్నాయి. అలా ఆసక్తికరమైన అనుభవం కోసం మొదలైన ప్రేక్షకుల జర్నీ కాసేపటికే ఇది ప్యాసింజర్ బండిలో ప్రయాణంగా మారుతుంది. అప్పుడే ప్రథమార్ధం అయిపోయిందా అనిపించే ఈ సినిమా ఆ తరువాత క్రమంగా గాడి తప్పుతుంది. ఆ తరువాత మళ్ళీ మునుపటి ‘మాయ’ కనిపించే ఘట్టాలు తక్కువే. దర్శక, రచయిత ఏ సీను రాసుకున్నప్పుడు ఆ సీనుకు తగ్గట్లు పాత్రలు ప్రవర్తిస్తూ ఉంటాయి. సిద్ధూ పాత్ర లాంటివి పాజిటివ్, నెగటివ్‌లకు రెంటికీ కాకుండా పోయాయి. అప్పటి దాకా జరగబోయేది తెలుస్తున్న నాయికకు ఉన్నట్టుండి, జరిగిపోయిన సంఘటన తెలియడమనేది నప్పని విషయం. కథ నడిపించడం కోసం దర్శక, రచయిత తనకు తాను కల్పించుకున్న ఓ వెసులుబాటు. అలాగే, ఎన్నో ఏళ్ళ క్రితం చిన్నప్పటి ఫ్రెండైన కథానాయికను పూజ పాత్ర చటుక్కున ఎలా గుర్తించేస్తుందని అడగకండి. ఇక, ద్వితీయార్ధంలో ఫ్యాషన్ షో ఎపిసోడ్ దగ్గర ‘ఢిల్లీ, రాత్రి వేళ...’ అంటూ వేసిన లొకేషన్ ఇండికేషన్ టైటిల్ మరింత గందరగోళం రేపింది. కథ ఆ క్షణానికి జరుగుతున్నది ఢిల్లీలోనా, హైదరాబాద్‌లోనా అన్నది అర్థం కాదు. సిద్ధూ పాత్ర, పోలీసు అధికారి కలసి చివరలో వెతుకులాట, ‘చంపడం మినహా మరో మార్గం లేద’నుకోవడం లాంటి వాటికి కథలో సరైన భూమిక లేదు. చివరలో నాయిక పాత్ర ద్వారా వేరొకరి ద్వారా సస్పెన్స్ ముడిని విప్పించడం తృప్తినివ్వదు. వెరసి, మూడు ముఖ్య పాత్రలు, వారి వారి కోణాల నుంచి కథ నడవడమనే అంశం బాగుందనిపించినా, రెండు గంటల సినిమా చూశాక, అర్ధాకలితో బయటకొచ్చిన భావనే మిగులుతుంది. తారాగణం: హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, కెమేరా: బాల్‌రెడ్డి, నిర్మాతలు: ఎం.వి.కె. రెడ్డి, ‘మధుర’ శ్రీధర్, రచన,దర్శకత్వం: నీలకంఠ బలాలు: విలక్షణమైన కథాంశం. సౌండ్ ఎఫెక్ట్లు తెరపై సినిమాను రిచ్‌గా కనిపించేలా చూపిన నాణ్యమైన నిర్మాణం బలహీనతలు: అతి నిదా...నంగా సాగే చిత్ర కథనం అందరూ కొత్త ముఖాలే కావడం ఆకట్టుకోని హీరోయిన్ నటన ఖంగాళీగా సాగే ద్వితీయార్ధం. - రెంటాల జయదేవ -
సినిమా రివ్యూ: మాయ
నటీనటులు: హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మా రాజ్, నాగబాబు, ఝాన్సీ సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి నిర్మాత: మధుర శ్రీధర్ దర్శకుడు: నీలకంఠ ప్లస్ పాయింట్స్: కథనం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాల్లో ఉండే వేగం లేకపోవడం, వినోదం లేకపోవడం షో చిత్రంతో జాతీయ అవార్డు, మిస్సమ్మ చిత్రంతో ప్రేక్షకులు అభిమానాన్ని, విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నీలకంఠ తాజాగా హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ, నందిని రాయ్ లతో 'మాయ'చిత్రాన్ని రూపొందించారు. సస్పెన్స్, థ్రిలర్ రూపొందిన ఈ చిత్రం మాయ చేసిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఓ టెలివిజన్ రిపోర్టర్ గా పనిచేసే మేఘన (అవంతిక మిశ్రా) చిన్నతనం నుంచి జరగబోయే సంఘటనలు ముందే తెలిసే ఈఎస్పీ (ఎక్స్ ట్రా సెన్సరీ పర్ సెప్షన్) అనే వ్యాధితో బాధపడుతుంటుంది. వృత్తిలో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్థ్ వర్మ (హర్షవర్ధన్ రాణే)తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సిద్ధూ, మేఘన ఒకర్నిమరొకరు ప్రేమించుకుంటారు. అయితే తన చిన్ననాటి స్నేహితురాలు పూజా(సుష్మా రాజ్)కు సిద్దూకి పెళ్లి కుదిరిందనే నిజం తెలుస్తుంది. అంతేకాకుండా సిద్దూ ఫస్ట్ లవర్ వైశాలి (నందిని రాయ్) రోడ్డు ప్రమాదంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందుతుంది. వైశాలి మృతి విషయంలో సిద్దూపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఇలా ఉండగా పూజాను సిద్దూ చంపబోతున్నట్టు మేఘనకు ముందే తెలుస్తుంది. పూజాను సిద్దూ నిజంగానే చంపుతాడా? పూజాను సిద్దూ ఎందుకు చంపాల్సి వస్తుంది? తన స్నేహితురాలు పూజాను మేఘన రక్షించుకుంటుందా? వైశాలి మృతి వెనుక కారణాలేంటి? వైశాలి మృతి విషయంలో సిద్దూపై ఎందుకు అనుమానాలు తెలుత్తాయి అనే ప్రశ్నలకు సమాధానమే 'మాయ'. మేఘన పాత్రలో అవంతిక మిశ్రాకు ఈ చిత్రంలో కీలకపాత్ర లభించింది. గ్లామరస్ గా కనిపించింది. కొంత నటనకు స్కోప్ ఉన్న పాత్రను పర్వాలేదనిపించే స్థాయిలో పోషించింది. ఫ్యాషన్ డిజైనర్ పాత్రను పోషించిన హర్షవర్ధన్ రాణేకు ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కించుకున్నారు. కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించడంలో తడబాటుకు గురైనాడు. కాని మిగితా చిత్రాలతో పొల్చుకుంటే హర్షకు ఇంపార్టెంట్ పాత్రనే ఈ చిత్రంలో లభించింది. యాక్టింగ్, హావభావాలు పలికించడంలోను మరికొంత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిత్రంలో పూజా పాత్రలో సుష్మా రాజ్ కనిపించింది. చిత్రంలో మరో కీలక పాత్రలో సుష్మా తన మార్కును ప్రదర్శించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆకట్టుకుంది. సిద్దూకి ప్రియురాళిగా నటించిన నందిని రాయ్ ది అంతగా ప్రాధాన్యత లేని పాత్రే. నాగబాబు, ఝాన్సీ అతిధి పాత్రలకే పరిమితమయ్యారు. టెక్నికల్: ఓ హారర్, థ్రిల్లర్ చిత్రాలకు అవసరమయ్యే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించి శేఖర్ చంద్ర ఆకట్టుకున్నారు. పాటలు అంతగా గుర్తుంచుకునేలా లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అని చెప్పవచ్చు. బాల్ రెడ్డి ఫోటోగ్రఫి క్వాలిటీ పరంగా బాగుంది. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎప్పుడూ విభిన్న కథాంశంతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు నీలకంఠ తాజాగా మరో ప్రయోగం మాయతో ముందుకొచ్చారు. తొలి సీన్ లోనే థ్రిల్ కలిగించి నీలకంఠ ఆకట్టుకున్నారు. ఆతర్వాత కథ నత్తనడక సాగడంతో తొలి భాగం కొంత విసుగు పుట్టించే విధంగా ఉంటుంది. ఇక రెండవ భాగంలో హీరోపై అనుమానాలు రేకెత్తించి కొంత ఆసక్తిని రేపాడు. క్లైమాక్స్ లో ఊహించని విధంగా కథను కీలక మలుపు తిప్పి నీలకంఠ తన మార్కును చూపించారు. ఎడిటింగ్ విభాగంపై మరికొంత దృష్టి పెట్టి ఉంటే కొంత వేగం పెరిగి ఉండేది. ప్రేక్షకుడ్ని థియేటర్ కు రప్పించే బలమైన అంశాలు లేకపోవడం కొంత నిరాశే. ఓవరాల్ గా వినోదమే ప్రధానంగా రూపొందుతున్న ప్రస్తుత ట్రెండ్ లో నీలకంఠ తాజా థ్రిల్లర్ చిత్రం 'మాయ' చేస్తుందా అనే విషయం తెలుసుకోవాలంటే కొద్ది రోజులాగాల్సిందే.