సింగం ఈజ్ బ్యాక్! | Surys new movie singham3 motion poster has been released for Diwali gift | Sakshi
Sakshi News home page

సింగం ఈజ్ బ్యాక్!

Oct 28 2016 11:18 PM | Updated on Sep 4 2017 6:35 PM

సింగం ఈజ్ బ్యాక్!

సింగం ఈజ్ బ్యాక్!

భయం లేదు.. చిక్కులెన్ని ఎదురైనా ముందడుగు వేసే వీరుడు.. పిడుగల్లే వచ్చే పోలీస్.. నరసింహం అలియాస్ సింగం మళ్లీ వస్తున్నాడు.

భయం లేదు.. చిక్కులెన్ని ఎదురైనా ముందడుగు వేసే వీరుడు.. పిడుగల్లే వచ్చే పోలీస్.. నరసింహం అలియాస్ సింగం మళ్లీ వస్తున్నాడు. సింహంలా గర్జించడానికి సిద్ధమయ్యాడు. హరి దర్శకత్వంలో మాస్ పోలీసాఫీసర్ నరసింహంగా హీరో సూర్య నటిస్తున్న చిత్రం ‘సింగం-3’. ‘యముడు’, ‘సింగం’ చిత్రాల తర్వాత ‘సింగం’ ఫ్రాంచైజీలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. దీపావళి కానుకగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నవంబర్ 7న టీజర్ విడుదల చేయనున్నారు.

అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ - ‘‘సింగం సిరీస్‌లో గత రెండు సినిమాల కంటే పవర్‌ఫుల్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. నవంబర్ చివరి వారంలో పాటల్ని, డిసెంబర్ 16న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement