ఇప్పుడు సూర్య ఛాన్స్ ఇస్తాడా..? | Suriya Movie With Pa Ranjith | Sakshi
Sakshi News home page

ఇప్పుడు సూర్య ఛాన్స్ ఇస్తాడా..?

Jul 24 2016 8:11 AM | Updated on Sep 4 2017 6:04 AM

ఇప్పుడు సూర్య ఛాన్స్ ఇస్తాడా..?

ఇప్పుడు సూర్య ఛాన్స్ ఇస్తాడా..?

కబాలి సినిమా సెట్స్ మీద ఉండగానే ఆ చిత్ర దర్శకుడు పా రంజిత్కు ఆఫర్లు వెల్లువెత్తాయి. యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అన్న తేడా లేకుండా అందరూ రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అంటూ...

కబాలి సినిమా సెట్స్ మీద ఉండగానే ఆ చిత్ర దర్శకుడు పా రంజిత్కు ఆఫర్లు వెల్లువెత్తాయి. యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అన్న తేడా లేకుండా అందరూ రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అంటూ ప్రకటించేశారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కబాలి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రంజిత్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది.

సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీ సక్సెస్ వెంటే పరిగెడుతుంది. హిట్ ఇచ్చిన నటీనటులు, దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. అదే ఫ్లాప్ ఇస్తే మాత్రం పట్టించుకోరు. మరి ఇప్పుడు పా రంజిత్ పరిస్థితి ఏంటి అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో తన నెక్ట్స్ పా రంజిత్తో అంటూ ప్రకటించిన సూర్య, మాట నిలబెట్టుకుంటాడా..? కబాలి తరువాత కూడా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తాడా..? చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement