రైతులకు స్టార్‌ హీరో భారీ సాయం

Suriya Has Donated 1 Crore To The Farmers In Tamil Nadu - Sakshi

ఇటీవల రైతు సమస్యల నేపథ్యంలో చినబాబు సినిమాను నిర్మించిన కోలీవుడ్ స్టార్‌హీరో సూర్య, రైతులకు భారీ విరాళం ప్రకటించారు. స్వయంగా ఆరుగురు రైతులకు 12 లక్షల రూపాయలు అందజేసిన సూర్య, రైతుల సంక్షేమం కోసం వ్యవసాయాభివృద్ధి సంస్థకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తమిళ నాట చినబాబు సినిమా ఘనవిజయం సాదించటంతో సినిమా లాభాలనుంచి ఈ సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించారు సూర్య. తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చినబాబు సినిమాను సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై స్యయంగా నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయిన ఈ సినిమా తెలుగు నాట పరవాలేదనిపించగా కోలీవుడ్ లో మాత్రం భారీ వసూళ్లను సాదిస్తూ దూసుకుపోతోంది.  రైతు సమస్యలతో పాటు కుటుంబ బంధాలు, అలకలు, కోపాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకుడు పాండిరాజ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top