
సన్నీ లియోన్
రాణీ వీరమహాదేవి విచ్చేశారు. బుధవారం స్టారై్టన షూటింగ్ లొకేషన్‌కు వచ్చారు. సిల్వర్ స్క్రీన్‌పై సన్నీ లియోన్ వీరమహాదేవి అనే విషయం తెలిసిందే. వీసీ వడివుడయాన్ దర్శకత్వంలో సన్నీ లియోన్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా ‘వీరమహాదేవి’. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో సినిమాని రూపొందిస్తున్నారు. తెలుగులో ‘వీరమహాదేవి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంతకుముందు ఐటమ్ సాంగ్స్, స్పెషల్ రోల్స్‌లో అలరించిన సన్నీ సౌత్‌లో హీరోయిన్‌గా చేస్తోన్న తొలి సినిమా ఇది.
ఇంకో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే... ఇందులో నవదీప్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా ఎంటైర్ షూట్‌లో ఆల్మోస్ట్ 300 గుర్రాలు అవసరం అవుతాయట. ‘క్వీన్’ వీరమహాదేవి పాత్ర కోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు సన్నీ లియోన్. ఇదిలా ఉంటే సినిమాలో ఆల్మోస్ట్ 50 పర్సెంట్ గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో ‘బాహుబలి, 2.0’ సినిమాలకు వర్క్ చేసిన టెక్నీషియన్స్‌ను తీసుకున్నారు. ‘‘వీరమహాదేవి షూటింగ్ స్టారై్టంది.. సో ఎగై్జటెడ్’’ అని పేర్కొన్నారు సన్నీ.