సంక్రాంతి బరిలో పూలరంగడు | sunil's krishnastami releasing on january 15th | Sakshi
Sakshi News home page

సంక్రాంతి బరిలో పూలరంగడు

Nov 8 2015 9:52 AM | Updated on Mar 22 2019 5:33 PM

సంక్రాంతి బరిలో పూలరంగడు - Sakshi

సంక్రాంతి బరిలో పూలరంగడు

సునీల్ కాస్త గ్యాప్ తీసుకొని కృష్ణాష్టమి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన టాలీవుడ్ నటుడు సునీల్. అందరూ కమెడియన్ లలా కాకుండా స్టార్ ఇమేజ్ అందుకునే స్ధాయి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. ఈ ఇమేజ్ ను ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయాడు. హీరోగా చేసిన రెండు మూడు సినిమాలు బాగానే వర్క్ అవుట్ అయినా తరువాత మాత్రం పెద్గగా ఆకట్టుకోలేకపోయాడు.

ముఖ్యంగా కామెడీ ఇమేజ్ ఉన్న సునీల్ సిక్స్ ప్యాక్ బాడీతో భారీ యాక్షన్స్ సీన్స్ చేసేటం ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. దీంతో సునీల్ చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఈ షాక్ తో ఆలోచనలో పడ్డ సునీల్ కాస్త గ్యాప్ తీసుకొని కృష్ణాష్టమి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

మరి లావుగా కాకపోయినా ఈ సినిమాలో కాస్త చబ్బీ చబ్బీగా కనిపిస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను భారీ పోటీ ఉన్న సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పవన్, మహేష్, బాలకృష్ణ లాంటి టాప్ స్టార్స్ పోటీలో ఉండగా సునీల్ తన సినిమా రిలీజ్ కు అదే సీజన్ ను ఎంపిక చేసుకోవటం రిస్కే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Advertisement
 
Advertisement
Advertisement