‘302’ గదిలో దయ్యం ఉంది | Sunil Launched 302 Movie Trailer | Sakshi
Sakshi News home page

‘హలో.. రూమ్‌నెం.302కి కండోమ్‌ ప్యాక్‌ కావాలి’

Mar 9 2020 3:40 PM | Updated on Mar 9 2020 5:16 PM

Sunil Launched 302 Movie Trailer - Sakshi

భవికా దేశాయ్ ప్రధాన పాత్రలోను, వెన్నెల కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘302’. ‘ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్’ అన్నది ఉపశీర్షిక. కార్తికేయ మిరియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ కమెడియన్‌, నటుడు సునీల్‌ ఆవిష్కరించారు. ఆదివారం విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్సే వస్తోంది. అయితే సినిమాలో శృతిమించిన సన్నివేశాలున్నట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. ‘హలో.. రూమ్‌ నెంబర్‌. 302కి ఒక కండోమ్‌ ప్యాకెట్‌ కావాలి’ అన్న అమ్మాయి మాటలతో టీజర్‌ ప్రారంభమవుతుంది. ఇక చివర్లో అదే అమ్మాయి దయ్యంగా మారినట్లు కనిపించడంతో టీజర్‌ ముగుస్తుంది.

ఆమె ఎందుకు ఆ గదిలోకి వచ్చింది? నిజంగానే ఆమె చనిపోయిందా? చనిపోయాక దయ్యంగా మారిందా? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. క్రైమ్, సస్పెన్స్, కామెడీ అంశాలతో పాటు కాస్త హారర్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ‘ఒకరోజులో అంటే.. 24 గంటల్లో జరిగే కథ’ అని తెలిపారు. ఈ సినిమాను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత అవినాష్ సుందరపల్లి వెల్లడించారు. ఈ చిత్రంలో వేణు టిల్లు, జబర్దస్త్ రాకేష్, నవీన్, దేవీచరణ్ తదితరులు నటించారు. (302 సినిమా టీజర్‌ లాంచ్‌ చేసిన సునీల్‌)

Advertisement
 
Advertisement
Advertisement