దెయ్యం లేని హారర్‌ చిత్రం | Sundar C To Act In Horror Comedy Iruttu | Sakshi
Sakshi News home page

దెయ్యం లేని హారర్‌ చిత్రం

Sep 30 2018 4:15 AM | Updated on Sep 30 2018 4:15 AM

Sundar C To Act In Horror Comedy Iruttu - Sakshi

సుందర్‌ .సి

మైసూర్‌ బోండాలో మైసూర్‌ ఉండదు. పులిహోరలో పులి కనిపించదు. అలాగే మా దెయ్యం సినిమాలో దెయ్యం ఉండదు అంటున్నారు ‘ఇరుట్టు’ చిత్రదర్శకుడు వీజెడ్‌ దొరై. సుందర్‌ .సి ముఖ్య పాత్రలో రూపొందుతోన్న హారర్‌ చిత్రం ‘ఇరుట్టు’. ఇందులో దర్శకుడు సుందర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. 85 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రం గురించి దర్శకుడు దొరై మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఎటువంటి కామెడీ ఉండదు. చాలా సీరియస్‌గా ఉత్కంఠగా సాగుతుంది. ఇప్పటి వరకూ ప్రేక్షకులు చూసిన హారర్‌ సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది. దెయ్యం లేని ఓ హారర్‌ చిత్రం రూపొందించాలనుకున్నాను. అనుకున్నట్టుగానే వస్తుంది’’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement