అక్కడ క్యాన్సిల్‌.. ఇక్కడ కన్ఫార్మ్‌ | Sun Pictures to produce Vijay's next movie | Sakshi
Sakshi News home page

అక్కడ క్యాన్సిల్‌.. ఇక్కడ కన్ఫార్మ్‌

Dec 10 2017 12:17 AM | Updated on Dec 10 2017 12:17 AM

Sun Pictures to produce Vijay's next movie - Sakshi

మురుగదాస్‌–విజయ్‌ హిట్‌ కాంబినేషన్‌ గురించి మనకు తెలిసిందే. ‘తుపాకి’, ‘కత్తి’ వంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు అందించిన ఈ కాంబినేషన్‌ ఈసారి ఇంకా పెద్ద బ్లాక్‌బాస్టర్‌ పై కన్నేశారు. అంత పెద్ద బ్లాక్‌ బాస్టర్‌ కొట్టాలంటే భారీ వ్యయం, విపరీతమైన హంగులు కావాలి. ఇవన్నీ కావాలంటే ఒక పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌ కావాలి. వీళ్ల సినిమాని ‘సన్‌ నేట్‌వర్క్‌’ చైర్మన్‌ కళానిథి మారన్‌ నిర్మించనున్నారు.

ఈ విషయాన్ని సన్‌ గ్రూప్‌ సంస్థ స్వయంగా వెల్లడించింది. జనవరిలో షూటింగ్‌ ప్రారంభించి, దీపావళికి సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి అలా ఉంచితే.. అక్షయ్‌కుమార్‌ హీరోగా మురుగదాస్‌ ఓ హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తారనే వార్త వచ్చింది. ఆ చిత్రం క్యాన్సిల్‌ అయింది. అంతకు ముందే కన్ఫార్మ్‌ అయిన విజయ్‌ సినిమాను పట్టాలెక్కించే పని మీద ఉన్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement