ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు కలిసి ఏం చేస్తున్నారో చూశారా? | Sumanth As ANR In NTR Biopic Look Revealed | Sakshi
Sakshi News home page

Sep 20 2018 7:36 PM | Updated on Sep 20 2018 8:09 PM

Sumanth As ANR In NTR Biopic Look Revealed - Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుత్నున సినిమాల్లో ‘ఎన్టీఆర్‌’ చిత్రం ప్రత్యేకం. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించబోతోంది ‘ఎన్టీఆర్‌’ . నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తూ, నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 

ఈ మూవీలో ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. నేడు ఏఎన్నార్‌ జయంతి సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ను రివీల్‌చేశారు చిత్రబృందం. ఫస్ట్‌ లుక్‌తో పాటు మరికొన్ని ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో వదిలారు. ఎన్టీఆర్‌ (బాలకృష్ణ), ఏఎన్నార్‌ (సుమంత్‌) కలిసి సిగరెట్‌ తాగుతున్న ఫోటోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పిక్‌ వైరల్‌ అవుతోంది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement