చెర్రీ, సుకుమార్లది పాత ప్రేమకథ..! | sukumar movie with ram Charan | Sakshi
Sakshi News home page

చెర్రీ, సుకుమార్లది పాత ప్రేమకథ..!

Oct 20 2016 9:48 AM | Updated on Sep 4 2017 5:48 PM

చెర్రీ, సుకుమార్లది పాత ప్రేమకథ..!

చెర్రీ, సుకుమార్లది పాత ప్రేమకథ..!

రొటీన్ మూస కథలతో సినిమాలు చేయటం దర్శకుడు సుకుమార్కు నచ్చదు. అందుకే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలతో పాటు ఆయన నిర్మించిన సినిమాలు కూడా సంథింగ్ డిఫరెంట్ అన్నట్టుగా...

రొటీన్ మూస కథలతో సినిమాలు చేయటం దర్శకుడు సుకుమార్కు నచ్చదు. అందుకే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలతో పాటు ఆయన నిర్మించిన సినిమాలు కూడా సంథింగ్ డిఫరెంట్ అన్నట్టుగా ఉంటాయి. ఇటీవల నాన్నకు ప్రేమతో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సుకుమార్, త్వరలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు ఇది ఓ ప్రేమకథ అంటూ ప్రచారం జరిగింది. సుకుమార్ చెర్రీ కోసం ప్రయోగాలను పక్కన పెట్టేశాడన్న టాక్ వినిపించింది.

కానీ సుకుమార్ మాత్రం మారలేదట. రామ్ చరణ్తో చేయబోయే సినిమాలో కూడా తన మార్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాను పీరియడ్ డ్రామాగా రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. దాదాపు 25 ఏళ్ల క్రితం జరిగే ఓ అందమైన పల్లె ప్రేమకథను వెండితెర మీద చూపించనున్నాడు. సెల్ ఫోన్లు ఈ మెయిల్స్ లేని కాలంలోని స్వచ్చమైన ప్రేమకథతో ఆడియన్స్ మెప్పించాలని ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement