రంగస్థలంలో సుకుమార్‌ డ్యాన్స్‌ | Sukumar and Ram Laxman Teenmaar Dance | Sakshi
Sakshi News home page

Jan 30 2018 3:35 PM | Updated on Apr 7 2019 4:36 PM

Sukumar Ram Laxan - Sakshi

రంగస్థలం సెట్‌లో డ్యాన్స్‌ చేస్తున్న దర్శకుడు సుకుమార్‌, ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్‌ హీరోగా రంగస్థలం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా షూటింగ్ లోకెషన్‌లో జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పుడూ కెమెరా వెనక నిలబడి యాక్షన్‌, కట్ చెప్పే సుకుమార్‌ సరదాగా డ్యాన్స్‌ చేస్తూ సెట్‌లో సందడి చేశాడు. సుకుమార్‌తో పాటు యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌, లక్ష్మణ్‌లు కూడా డ్యాన్స్‌ చేశారు. తీన్‌ మార్‌ బీట్‌కు వీరు చేసిన డ్యాన్స్‌ వీడియో వైరల్‌గా మారింది.

పీరియాడిక్‌ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్‌ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా మార్చి 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు చిత్రయూనిట్‌. ఈ సినిమాలో చరణ్‌ లో వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడు. తొలిసారి చరణ్‌ ఓ పల్లెటూరి కుర్రాడి పాత్రలో నటిస్తుండటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement