
బాలీవుడ్ తెరపై మరో వివాదం మొదలైంది. ప్రస్తుతం ఐఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకుడు సుజోయ్ గోష్ తన పదవికి రాజీనామా చేశారు. ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించే సినిమాల ఎంపిక విషయంలో వచ్చిన బేధాభిప్రాయాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 13 మంది సభ్యులతో కూడిన ఐఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ ఎంపిక చేసిన సినిమాల జాభితా నుంచి మలయాళ సినిమా‘ఎస్ దుర్గ’, మరాఠి సినిమా ‘న్యూడ్’ లను సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తొలగించింది. అందుకు నిరసనగా సుజోయ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ప్రదర్శనకు 5 మెయిన్‌స్ట్రీమ్ సినిమాలతో కలిపి మొత్తం 26 చిత్రాలను ఎంపిక చేశారు.