యంగ్ హీరో న్యూ ఇయర్ ప్లాన్స్ | Sudheer babu New year plans | Sakshi
Sakshi News home page

Jan 2 2018 10:31 AM | Updated on Jan 2 2018 10:31 AM

Sudheer babu New year plans - Sakshi

కొత్త ఏడాదిలో వరుస సినిమాలతో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. ఈ ఏడాది తాను చేయబోయే సినిమాలను కూడా ప్రకటించాడు. గత ఏడాదిలో తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపాడు సుధీర్. 2017లో రిలీజ్ అయిన శమంతకమణి సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పిన సుధీర్ బాబు ఈ పాత్ర ద్వారా తన తల్లి తనకు మరింత దగ్గరయ్యిందని తెలిపాడు. 

ఇక 2018లో తాను నాలుగు సినిమాలు చేయబోతున్నట్టుగా వెల్లడించాడు. జాతీయ అవార్డు పొందిన దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, ప్రవీణ్ సత్తారులతో సినిమాలు చేయనున్న సుధీర్ ఇంద్రసేన, ఆర్‌ఎస్‌ నాయుడు అనే కొత‍్త దర్శకులతోనూ సినిమాలు చేయనున్నాడు. అంతేకాదు ఈ ఏడాదిలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement