మరింత భయం

Stree sequel confirmed! Rajkummar Rao and Shraddha Kapoor - Sakshi

రాజ్‌కుమార్‌ రావు, శ్రద్ధా కపూర్‌ జంటగా గతేడాది విడుదలైన హిందీ చిత్రం ‘స్త్రీ’ బాక్సాఫీస్‌ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ హారర్‌ సినిమాకు సీక్వెల్‌ చేయనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతానికైతే సీక్వెల్‌ ప్రస్తావనను పక్కన పెడితే రాజ్‌కుమార్‌ రావు మళ్లీ ఓ హారర్‌ సినిమా చేయడానికి అంగీకరించారు. ‘స్త్రీ’కి ఒక నిర్మాతగా వ్యవహరించిన దినేష్‌ విజనే ఈ సినిమాను నిర్మించనున్నారు. మేలో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారని తెలిసింది. ఇందులో వరుణ్‌శర్మ కీలకపాత్ర చేయనున్నారు. ఈ చిత్రానికి ‘ఫక్రీ’ ఫ్రాంచైజీ ఫేమ్‌ మృగ్‌దీప్‌ లమ్బా దర్శకత్వం వహిస్తారు. ఇందులో హీరోయిన్‌ ఫిక్స్‌ కాలేదు. ఈ చిత్రానికి ‘రూహ్‌ అఫ్జా’ అనే టైటిల్‌ పెట్టాలను కుంటున్నారు. ‘స్త్రీ’ కన్నా ఈ సినిమా ఇంకా భయపెట్టే విధంగా స్క్రీన్‌ప్లే ఉంటుందట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top