విడాకులు తీసుకుంటున్న ఆ పోర్న్‌స్టార్‌

Stormy Daniels And Her Husband Petition For Divorce - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు శారీరక సంబంధాలున్నాయని ఆరోపించి పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ (అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఒహియో రాష్ట్రంలో ఓ క్లబ్‌లో ఆమె స్ట్రిప్పింగ్‌ డాన్సులు చేస్తూ.. కొందరితో అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆరోపణలతో అరెస్ట్‌ అయి కొన్ని గంటల్లోనే విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగిన కారణంగా అడల్ట్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. భర్త బ్రెండన్‌ మిల్లర్ (అసలుపేరు గ్రెండన్‌ క్రెయిన్‌), స్టార్మీ డేనియల్స్‌ విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

అడల్ట్‌ స్టార్‌ తరపు న్యాయవాది మైఖెల్‌ అవెనట్టి మాట్లాడుతూ.. ‘నా క్లయింట్‌ స్టార్మీ డేనియల్స్‌, ఆమె భర్త గ్లెన్‌ విడాకులకు మొగ్గు చూపారు. విడాకులు కోరుతూ ఈ జంట గతవారం పిటిషన్‌ దాఖలు చేసింది. అభిప్రాయభేదాల వల్ల పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకున్నారు. కూతురు తన వద్దే ఉంటుందని స్టార్మీ చెప్పారు. కుటుంబం కోసం తనకు ప్రైవసీ కావాలని కోరుతున్నట్లుగా’ వివరించారు. బ్రెండన్‌ మిల్లర్‌ కూడా పలు అడల్ట్‌ సినిమాల్లో నటించాడు.

నిజం నిగ్గుతేలాలి
అధ్యక్షుడు ట్రంప్‌తో తన శారీరక సంబంధాల ఆరోపణలపై నిగ్గు తేలాలన్నారు. అంతేకానీ నాకు ఈ విషయంలో ఎలాంటి రాజీమార్గాలు అవసరం లేదు. నేను దేనికీ భయపడను. 2006లో తనతో ట్రంప్‌ నెరిపిన సంబంధాలపై గత అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎవరితోనూ బయటపెట్టొద్దని 1,30,000 డాలర్లకు భేరం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కానీ ఓ వ్యక్తి తనను బెదిరించిన కారణంగా 10ఏళ్ల తర్వాత ఈ విషయాలు బహిర్గతం చేయాల్సి వచ్చిందని పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top