‘ఆకాశవాణి’ నుంచి జక్కన్న తనయుడు ఔట్‌?

SS Rajamouli Son Karthikeya Akashavani Movie Update Viral - Sakshi

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశవాణి’. ఈ చిత్రంతో అశ్విన్‌ గంగరాజు అనే యువదర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందంచిన ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తయింది. నూతన నటీనటులతో వైవిధ్య భరితంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

ఈ సినిమా నిర్మాణ బాధ్యతల నుంచి కార్తికేయ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజమౌళి చిత్రాలకు ప్రొడక్షన్‌, మార్కెటింగ్‌ వంటి బాధ్యతలను కార్తికేయనే చూసుకుంటాడన్న విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. 

దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను అనుకున్న తేదీకి థియేటర్లలోకి తీసుకరావాలంటే ఊపిరి సలపడకుండా కష్టపడాల్సి ఉంటుంది. దీంతో తన సినిమా నుంచి తప్పుకుని పూర్తి సమయాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం కేటాయించాలని కార్తికేయ భావించినట్లు, అందుకే ‘ఆకాశవాణి’ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

చదవండి:
హారర్‌ చిత్రంలో చైతూ.. డైరెక్టర్‌ అతడేనా?
మే 9 వెరీ స్పెషల్‌ డే ఎందుకంటే?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top