
100 మిలియన్లా.. ఊహించలేదు: రాజమౌళి
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి-2' విడుదలకు ముందే రికార్డులను సృష్టిస్తోంది.
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి-2' విడుదలకు ముందే రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైన ఈ మూవీ ట్రైలర్ 100 మిలియన్‌లకు పైగా వ్యూస్‌ను సాధించింది. దీనిపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. 100 మిలియన్లా (10 కోట్లు).. ఈ స్థాయిలో ట్రైలర్ చూస్తారని అసలు ఊహించలేదని.. అభిమానులు దీన్ని సాధ్యం చేశారని ట్వీట్ చేశారు. ఆన్‌లైన్‌లో అత్యధికమంది వీక్షించిన ట్రైలర్‌గా రికార్డులు సృష్టించిన 'బాహుబలి-2'.. ఇప్పుడు అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నెల 26న బాహుబలి-2 ఆడియో ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తున్నామని, అదే రోజు తెలుగు ప్రేక్షకులకు స్టోర్లలో ఆడియో దొరుకుతుందని రాజమౌళి ట్వీట్లు చేశారు. ఈ 26న సాయంత్ర ఆరున్నర గంటలకు 360 డిగ్రీస్‌లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను 4k రిజల్యూషన్‌తో అభిమానులకు అందుబాటులోకి తీసుకొస్తుంది మూవీ యూనిట్. మరోవైపు దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ మూవీ విడుదల అవుతుంది. తొలిసారిగా ఓ సినిమా భారత్‌లో ఇన్ని థియేటర్లలో విడుదల కావడం ఇదే ప్రథమం.
బాహుబలిరేడ్‌ఆన్ అని హ్యాష్ ట్యాగ్‌తో దర్శకుడు రాజమైళి ఈ విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
Along with the regular live stream, for the 1st time,we are streaming the pre release event in 360° with 4K res to give the best experience.
— rajamouli ss (@ssrajamouli) 24 March 2017
#Baahubali2 Pre Release Event on March 26th, in Hyderabad. Telugu audio will be in stores on the same day..:)
— rajamouli ss (@ssrajamouli) 24 March 2017
100 million !!!
Never ever thought of these numbers... For all those who made it possible