కన్ఫామ్ : త్వరలో నాగ్, నానీల మల్టీ స్టారర్ | Sriram aditya multi starrer with Nagarjuna, Nani | Sakshi
Sakshi News home page

కన్ఫామ్ : త్వరలో నాగ్, నానీల మల్టీ స్టారర్

Oct 3 2017 3:33 PM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarjuna Nani - Sakshi

ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే సీనియర్ హీరో నాగార్జున త్వరలో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. యంగ్ హీరోలతో కలిసి తెరను పంచుకునేందుకు నాగ్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే మంచు విష్ణు, కార్తీ లాంటి హీరోలతో కలిసి నటించిన నాగ్, త్వరలో సక్సెస్ ఫుల్ హీరో నానితో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.

ప్రస్తుతం రాజుగారి గది 2 ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కింగ్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య, నాగార్జున, నానిల కాంబినేషన్ లో సినిమాను రూపొందించనున్నారు. శ్రీరామ్ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే ఓకె చెప్పానన్న నాగ్, ఈ సినిమాలో నాని క్యారెక్టర్ కడుపుబ్బ నవ్విస్తుందన్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement