‘ఇట్లు అంజ‌లి’ ట్రైల‌ర్ లాంచ్‌

Srikanth and Maruthi Launch the Trailer of Itlu Anjali - Sakshi

శ్రీకృష్ణ వొట్టూరు స‌మ‌ర్పణ‌లో ఓమా ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై న‌వీన్ మ‌న్నేల  స్వీయ ద‌ర్శక‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘ఇట్లు అంజ‌లి’. ఈ సినిమాలో శ్రీ కార్తికేయ‌, హిమాన్సీ, శుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన  ఈ చిత్రం ట్రైల‌ర్ లాంచ్ హీరో శ్రీకాంత్, ద‌ర్శకుడు మారుతి చేతుల మీదుగా సోమ‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...‘ ట్రైల‌ర్ , పాట‌లు చాలా బావున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన శ్రీ కార్తికేయ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న ఈ సినిమా,  త‌న‌తో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. ద‌ర్శకుడు మారుతి మాట్లాడుతూ...‘ట్రైల‌ర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రీ కార్తికేయ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ట్రైల‌ర్ లో  త‌న ప‌ర్ఫార్మెన్స్  చాలా బావుంది. హీరోగా త‌న‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నా’ అన్నారు.

ద‌ర్శక నిర్మాత న‌వీన్ మ‌న్నేల  మాట్లాడుతూ... ‘నాకు ఇష్టమైన హీరో శ్రీకాంత్ గారు, ద‌ర్శకుడు మారుతిగారు మా ఫంక్షన్ కు వ‌చ్చి వారి చేతుల మీదుగా ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇదొక ప్రేమ‌లేఖ ఆధారంగా సాగే  డిఫ‌రెంట్ రొమాంటిక్  థ్రిల్లర్ చిత్రం. ఇప్పటి వ‌ర‌కు వ‌చ్చిన  థ్రిల్లర్స్ క‌న్నా చాలా విభిన్నంగా ఉంటుంది. టీమ్ అంతా క‌ష్టప‌డి సినిమా చేసాం. మా క‌ష్టానికి త‌గ్గ ప్రతిఫ‌లం ద‌క్కుతుంద‌న్న న‌మ్మకంతో ఉన్నాం. ఇందులో చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌కు న‌చ్చే సినిమా అవుతుంది’ అన్నారు.

హీరో శ్రీ కార్తికేయ మాట్లాడుతూ...‘‘ఆ న‌లుగురు’ సినిమాలో అప్పడాల కుర్రాడిగా నాకు మంచి పేరొచ్చింది. ఆ త‌ర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసా. హీరోగా  ఇది నా తొలి సినిమా. ప్రొడ్యూసింగ్, డైర‌క్షన్ రెండూ చాలా ట‌ఫ్ జాబ్స్. అయినా మా న‌వీన్ గారు రెండింటినీ స‌మ‌ర్థవంతంగా నిర్వహించారు. అలాగే కార్తిక్ కొడ‌కండ్ల అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా కుదిరింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆద‌రించిన నన్ను హీరోగా కూడా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top