రీమేక్‌ కోసం కలిశారు | Srikanth Addala to direct Venkatesh in Asuran | Sakshi
Sakshi News home page

రీమేక్‌ కోసం కలిశారు

Nov 19 2019 12:14 AM | Updated on Nov 19 2019 12:14 AM

Srikanth Addala to direct Venkatesh in Asuran - Sakshi

వెంకటేశ్‌, శ్రీకాంత్‌ అడ్డాల

తమిళ సూపర్‌హిట్‌ సినిమా ‘అసురన్‌’ని తెలుగులో వెంకటేశ్‌ రీమేక్‌ చేస్తారని ప్రకటించినప్పటినుంచి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తారా? అనే ఆసక్తి ఏర్పడింది. ధనుష్‌ హీరోగా వెట్రిమారన్‌ తెరకెక్కించిన ‘అసురన్‌’ పేద–ధనిక విబేధాలు, వర్గ పోరు అనే సమస్యలను చర్చించిన సినిమా. తమిళంలో నిర్మించిన కలైపులి యస్‌ థానుతో సురేశ్‌బాబు తెలుగు రీమేక్‌ను నిర్మిస్తారు. ఆ మ్యాజిక్‌ని మళ్లీ రిపీట్‌ చేసే దర్శకుడు ఎవరనే చర్చ సినిమా ప్రియుల్లో మొదలైంది.

తెలుగు రీమేక్‌కి దర్శకులు వీరే అని పలు పేర్లు వినిపించినా ఫైనల్‌గా శ్రీకాంత్‌ అడ్డాల కన్‌ఫార్మ్‌ అయ్యారని తెలిసింది. గతంలో వెంకటేశ్, శ్రీకాంత్‌ అడ్డాల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013) సినిమా చేశారు. ఇప్పుడు రీమేక్‌ కోసం ఆరేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌ కలిసింది. జనవరి మొదటివారంలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను మేలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాలో శ్రియని కథానాయికగా అనుకుంటున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement