మహేష్కు నో చెప్పిన శ్రీదేవి కూతురు | Sridevi’s daughter Jhanvi turns down film with Mahesh Babu | Sakshi
Sakshi News home page

మహేష్కు నో చెప్పిన శ్రీదేవి కూతురు

Jul 29 2016 8:05 PM | Updated on Sep 4 2017 6:57 AM

మహేష్కు నో చెప్పిన శ్రీదేవి కూతురు

మహేష్కు నో చెప్పిన శ్రీదేవి కూతురు

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు వర్థమాన తారలు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు వర్థమాన తారలు. సార్కున్న క్రేజ్ అలాంటిది మరి. కానీ మహేష్ సినిమాకు 'నో' చెప్పి అందరినీ ఆశ్చర్యపరచింది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి. తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్.. మహేష్తో ఓ భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సినిమా చిత్రీకరణ కూడా మొదలుపెట్టేశారు. అయితే మహేష్ హీరోయిన్ కోసం మురుగదాస్ చాలామంది పేర్లనే పరిశీలించాడు. శ్రీదేవి కూతురు జాన్విని ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ప్రయత్నం కూడా చేశాడట. ఆ ప్రయత్నంలోనే మురగదాస్.. శ్రీదేవి, బోనీ కపూర్ లను సంప్రదించాడు. శ్రీదేవి దంపతులు కూడా మురుగదాస్ ప్రపోజల్కి సుముఖత వ్యక్తం చేశారు.

అయితే జాన్వివి మాత్రం నో అనేసిందట. తను అప్పుడే సినిమాల్లోకి రావాలని అనుకోవడంలేదని, దానికి ఇంకాస్త ప్రిపరేషన్ కావాలని చెప్పిందట. తను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని, డ్యాన్స్లో మెళకువలు నేర్చుకునే పనిలో ఉన్నానని సెలవిచ్చిందట. ప్రస్తుతం జాన్వి లాస్ ఏంజిల్స్లోని ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతోంది. పూర్తిగా శిక్షణ తీసుకున్న తరువాతే తెరంగేట్రం చేయాలనేది అమ్మడి ఆలోచన.. అది కూడా బాలీవుడ్ సినిమా ద్వారానే తొలిసారి తెర మీద కనిపించాలనేది జాన్వి కోరిక. దాంతో చేసేదేమీలేక మురుగదాస్ వెనక్కి రావాల్సి వచ్చింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగుంటే ఈ వారం మహేష్తో కలిసి జాన్వి షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం రకుల్ అదే పనిలో బిజీగా ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement